English   

సిల్లీఫెలోస్ కు ఎట్టకేలకు మోక్షం 

Silly-Fellows-release
2018-08-09 19:12:55

కమెడియన్ తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న సునిల్ హీరో అయ్యాడు. హీరోగా కొంచెం మాత్రమే సక్సెస్ అయిన సునిల్ మళ్లీ కమెడియన్ యూ టర్న్ తీసుకున్నాడు. కామెడీ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకుని కొన్నాళ్లుగా హిట్ లేక ఢీలాపడ్డ అల్లరి నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా సై అంటున్నాడు. ఇలాంటి డిఫరెంట్ సిట్యుయేషన్ లో ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాగా సిల్లీ ఫెలోస్ రాబోతోంది. ఇక కెరీర్ ఆరంభం నుంచీ రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఈ సిల్లీఫెలోస్ కు దర్శకుడు. ఇక చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఫైనల్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సిల్లీఫెలోస్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సిల్లీ ఫెలోస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.  ఆ మధ్య ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ అదేమంత ఆకట్టుకోలేదనే పేరు వచ్చింది. మొత్తంగా అసలు ఈ సినిమా గురించి కూడా ఆడియన్స్ మరిచిపోయారు. ఈ టైమ్ లో సడెన్ గా రిలీజ్ డేట్ తో సహా వీళ్లు మళ్లీ న్యూస్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ సునిల్ కంటే నరేష్ కు ఎక్కువ ఇంపార్టెన్స్. ఇది కూడా తేడా కొడితే ఇక నరేష్ కూడా పూర్తిగా క్యారెక్టర్ యాక్టర్ గా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో చిత్ర శుక్లా, నందినిరాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

More Related Stories