English   

త్రివిక్ర‌మ్ సినిమాలో సిమ్రాన్

Simran
2021-05-10 14:39:28

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌కు సీనియ‌ర్ హీరోయిన్ ల‌ను ఎంచుకుంటారు. త్రివిక్ర‌మ్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో విల‌న్ కు ఉపేంద్ర‌కు భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్  స్నేహ‌ను తీసుకున్నారు. అంతే కాకుండా అ,ఆ సినిమాలో స‌మంత త‌ల్లి పాత్ర‌లో న‌టించేందుకు న‌దియాను ఎంపిక చేశారు. అజ్ఙాతవాసి సినిమా కోసం సీనియ‌ర్ హీరోయిన్ కుష్భును ఎంపిక చేశారు. అల వైకుంఠ పురంలో ట‌బును...అరవింద స‌మేత సినిమాలో దేవ‌యానిని తీసుకున్నారు. ఈ సినిమాల్లో న‌టించిన సీనియ‌ర్ హీరోయిన్ లు త‌మ పాత్ర‌ల‌ను న్యాయం చేశారు. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ కు కూడా అదో సెంటిమెంట్ లా మారిపోయింది.

అయితే ఇప్ప‌డు త్రివిక్ర‌మ్ మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్ ను త‌న సినిమాలో భాగం చేయ‌బోతున్నార‌ట‌. మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తున్న సంగ‌తి తెసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా పై అధికారిక ప్ర‌క‌టన కూడా విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం త్రివిక్ర‌మ్ సిమ్రాన్ ను తీసుకోవాల‌నుంకుటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇక సిమ్రాన్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇప్పుడు అక్క‌....వ‌దిన క్యారెక్ట‌ర్ల‌లో ఎలా ఒదిగిపోతుందో చూడాలి మ‌రి. 

More Related Stories