English   

 మ‌హాన‌టికి మ‌హా ప్ర‌శంస‌..!

Singeetam-Srinivas
2018-05-18 11:07:10

మ‌హాన‌టి విడుద‌లైన రోజు నుంచి కీర్తిసురేష్ కు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తూనే ఉంది. రోజూ ప్ర‌తీఒక్క‌రు సినిమా చూడ‌టం.. ఈ భామ‌ను పొగ‌డ‌టం.. ఇదే ప‌నైపోయింది ఇండ‌స్ట్రీలో. అల్లు అర‌వింద్ అయితే ఏకంగా ప్ర‌త్యేకంగా ఈ చిత్రం కోసం ప్ర‌శంస‌స‌భ‌నే ఏర్పాటు చేసాడు. అందులో అంతా కీర్తితో పాటే నాగ్ అశ్విన్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కీర్తిసురేష్ కు అంత‌కుమించిన ప్ర‌శంస ఒక‌టి ద‌క్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం గురించి ఎవ‌రెన్ని క‌మెంట్స్ చేసినా కూడా ఇప్పుడు కీర్తికి ఓ లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు ఇచ్చిన ప్ర‌శంస మాత్రం జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. అత‌డే సింగీతం శ్రీ‌నివాస‌రావ్. సావిత్రిని అతి ద‌గ్గ‌ర్నుంచీ చూసిన వాళ్ల‌లో.. ఆమెతో క‌లిసి ప‌ని చేసిన వాళ్ల‌లో ఈయ‌న కూడా ఒక‌రు. అంతేకాదు.. మాయాబ‌జార్ కు సంబంధించిన వాళ్ల‌లో ప్రాణాల‌తో ఉన్న‌ది కూడా ఈయ‌న ఒక్క‌రే.
 
ఆ సినిమాకు ఈయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కేవీ రెడ్డి ద‌గ్గ‌ర ప‌ని చేసారు. అప్పుడు సినిమాకు ప‌ని చేసినా కూడా ఎందుకో కానీ సావిత్రితో ఫోటో దిగే అవ‌కాశం ఈయ‌న‌కు రాలేదు. అయితే ఇప్పుడు కీర్తిసురేష్ తో సింగీతం ఫోటో దిగారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. జీవితంలో చాలామంది న‌న్ను అడిగారు సావిత్రి గారితో  ఫోటో దిగారా అని అప్పుడు కుద‌ర‌లేదు.. కానీ ఇప్పుడు కుదిరింది.. ఎస్ అని చెప్తాను అంటూ కీర్తితో దిగిన ఫోటోను ఆయ‌న చూపించారు. దీనికంటే గొప్ప ప్ర‌శంస కీర్తిసురేష్ కు ఇంకేం కావాలి..! లెజెండ‌రీ సినిమాలు చేసిన సింగీతం లాంటి లెజెండ్ నుంచి కీర్తికి అందిన ఈ ప్ర‌శంస మామూలుది కాదు. కోట్లు విలువ చేసినా కూడా రాని ఆనందాన్ని ఈ ఒక్క ఫోటోతో అందుకుంది కీర్తి. మొత్తానికి ఈ చిత్రంతో కీర్తి ఖాతాలో ఇంకా ఎన్ని ప్ర‌శంస‌లు.. అవార్డులు చేర‌బోతున్నాయో..?

More Related Stories