English   

ప్ర‌భాస్ కు షాక్...సినిమా నుండి త‌ప్పుకున్న డైరెక్ట‌ర్

Singeetham Srinivasa Rao
2021-04-30 12:53:16

రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని నాగ్ అశ్విన్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

అంతే కాకుండా ఈ సినిమాలో లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ కూడా భాగం అవుతున్నట్టు అప్పట్లో అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమా లు చేసిన దర్శకుడు తమ సినిమా కోసం పనిచేయడం అదృష్టమని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుండి సింగీతం శ్రీనివాస్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

ముందుగా ఈ కథకోసం నాగ్ అశ్విన్ తో కలిసి సింగీతం పని చేయాలనుకున్నారు. దాంతో సింగీతం తనకు వచ్చిన ఐడియాలను నాగ్ అశ్విన్ తో పంచుకున్నారట. కానీ నాగ్ అశ్విన్ సింగీతం సలహాలను లైట్ తీసుకుంటున్నారట. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఫామ్ లో ఉండటం తో నిర్మాణ సంస్థ కూడా సైలెంట్ గా ఉండిపోయిందట. ఈ నేపథ్యంలోనే సింగీతం ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

More Related Stories