English   

ఇంట్లోనే ఉన్నా..కానీ క‌రోనా వచ్చింది 

Singer Smitha
2020-08-05 07:59:44

కరోనా ఎవరినీ వదలడం లేదు, సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. అటు అమితాబ్ మొదలు మన తేజ వరకూ ఎలా వస్తోందో కూడా తెలీకుండానే ఎటాక్ చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇళ్ళల్లో ఉంటున్నారు. అయినా ఇళ్ళలో ఉన్న వారికి కూడా కరోనా సోకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా టాలీవుడ్ కి చెందిన సింగర్ స్మితకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు." నిన్న వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల బాడీ పెయిన్స్ వచ్చాయనుకున్నా... కానీ ఎందుకైనా మంచిదని శశాంక్(భర్త), నేను కోవిడ్ పరీక్ష లు చేయించుకున్నాం, పాజిటివ్ గా తేలింది. మేము ఇంట్లో జాగ్రత్తగా ఉన్నా... కరోనా మా ఇంటికి వచ్చింది." అని స్మిత ట్వీట్ చేశారు. 

మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్రం నెగిటివ్ వచ్చిందని ఆమె పేర్కొంది. ఎటువంటి లక్షణాలు లేకుండానే  కరోనా ఉందని తేలిందని త్వరలోనే కరోనాతో పోరాడి తాను ప్లాస్మా దానం చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే నిర్మాత పోకూరి రామారావు, దర్శకుడు రాజమౌళి, తేజలు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలోకి స్మిత వచ్చి చేరారు. రామారావు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

More Related Stories