English   

విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి 

SP Balasubrahmanyam
2020-08-14 19:01:24

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా లక్షణాలతో ఆయన ఈనెల 5వ తేదీనే ఈ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించారని చెబుతున్నారు. ఈమేరకు ఎస్పీ బాలు ఆరోగ్యం మీద ఎంజీఎం హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలుని పర్యవేక్షిస్తున్నారని, లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నాని ఎంజీఎం హాస్పిటల్స్ బులెటిన్ లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ఎంజీఎం హాస్పిటల్స్ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది కరోన బారిన పడగా వారందరూ కోలుకున్నారు.  

More Related Stories