English   

ప‌వ‌న్ దారిలోనే ఆ త‌మిళ హీరో.. 

Pawan-Kalyan-Sivakarthikeyan
2018-03-14 12:26:21

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌కుండానే చాలామందికి మార్గ‌నిర్దేశ‌కుడు అవుతున్నాడు. తెలిసి ఫాలో అవుతున్నారో.. తెలియ‌కుండానే ఫాలో అవుతున్నారో తెలియ‌దు కానీ ఇప్పుడు ప‌వ‌న్ దారిలోనే ఓ త‌మిళ హీరో కూడా వెళ్తున్నాడు. ఆయ‌నే శివ‌కార్తికేయ‌న్. మ‌న ద‌గ్గ‌ర నాని ఎలాగైతే చిన్న హీరో స్థాయి నుంచి పైకి వ‌చ్చాడో.. అలాగే త‌మిళ‌నాట శివ‌కార్తికేయ‌న్ కూడా అంతే. ఒక్కో విజ‌యంతో అంచ‌లంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈయ‌న సినిమా వ‌స్తే క‌నీసం 40 కోట్లు ఖాయం. హీరోగా ఇంత క్రేజ్ వ‌చ్చింది కాబ‌ట్టి యాడ్స్ కూడా వ‌స్తూనే ఉంటాయి అది కామ‌న్. కానీ ఈ హీరో యాడ్ రంగానికి దూరంగా ఉన్నాడు. 

ముఖ్యంగా కూల్ డ్రింక్స్ విష‌యంలో అస్స‌లు ఎండోర్స్ మెంట్ చేయ‌డం లేదు శివ కార్తి కేయ‌న్. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానిక‌రం అని.. తాను గ‌త ఎనిమిదేళ్లుగా వీటికి దూరంగా ఉన్నాన‌ని.. త‌న నాలుగేళ్ళ కూతురు కూడా కూల్ డ్రింక్స్ తాగ‌ద‌ని.. అంతేకాదు పిజ్జా, బ‌ర్గ‌ర్ లాంటి ఫుడ్ కూడా త‌న కూతురు తిన‌ద‌ని చెప్పాడు శివ‌కార్తికేయ‌న్. తానే తిన‌ను.. తాగ‌న‌పుడు జ‌నాన్ని మాత్రం వాటిని తాగండి అంటూ ఎలా ప్ర‌చారం చేయ‌గ‌ల‌న‌ని ప్ర‌శ్నిస్తున్నాడు శివ‌కార్తికేయన్. త‌న‌కు న‌చ్చ‌ని ప‌ని తాను చేయ‌లేన‌ని.. కూల్ డ్రింక్స్ విష‌యంలో మాత్రం తాను ఎండోర్స్ చేయ‌లేన‌ని వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను కూడా వ‌దిలేస్తున్నాడు శివ‌. గ‌తంలో ప‌వ‌న్ కూడా ఇదే చేసాడు. పెప్సీకి కొన్ని రోజులు ఎండోర్స్ చేసిన ప‌వ‌ర్ స్టార్.. అవి హానిక‌రం అని తెలిసిన త‌ర్వాత వ‌దిలేసాడు. మొత్తానికి ఇప్పుడు ప‌వ‌న్ దారిలోనే శివ‌కార్తికేయ‌న్ కూడా వెళ్తున్నాడు. 

More Related Stories