English   

ఇంత‌కీ ఎక్క‌డున్నావ్ సోనాక్షి..?

sonakshi-sinha

క‌నబ‌డుట లేదు.. ఇప్పుడు సోనాక్షి సిన్హా కోసం బాలీవుడ్ లో ఇదే యాడ్ ఇచ్చేలా ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు ఈ భామ‌. టైమ్ బ్యాడ్ అయితే అర‌టిపండు తిన్నా ప‌న్నురుగుద్దంట‌..! ఇప్పుడు సోనాక్షిని చూస్తే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈ పేరుకు ఒక‌ప్పుడు బాలీవుడ్ లో కావాల్సినంత ఇమేజ్ ఉండేది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే హీరోయిన్ అయిపోయింది. నాన్న శ‌త్రుఘ్న‌సిన్హా చ‌ల‌వ‌తో ద‌బంగ్ తో స‌ల్మాన్ తో చిందేసింది సోనాక్షి. తొలి సినిమా హిట్ట‌వ్వ‌డంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. దాంతో ఎక్స్ పోజింగ్ అనే మాటే లేకుండా నెంబ‌ర్ వ‌న్ గా ఎదిగింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండ‌దు క‌దా.. అందుకే క‌ష్ట‌కాలంలో అమ్మ‌డు అల‌వాట్లు మార్చుకోక త‌ప్ప‌ట్లేదు. రీసెంట్ గా వ‌చ్చిన నూర్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్ర‌స్తుతం ఈ భామ ఆశ‌ల‌న్నీ వెల్ క‌మ్ టూ న్యూయార్క్ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ తోనే బిజీ బిజీగా ఉంది సోనాక్షి.

ఇప్పుడు మ‌రో రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా క‌మిటైంది సోనాక్షి. అభిషేక్ వ‌ర్మ‌న్ క‌లంక్ తో పాటు స‌ల్మాన్ ఖాన్ ద‌బంగ్ 3 సినిమాల్లో సోనాక్షి హీరోయిన్ గా న‌టిస్తుంది. క‌లంక్ లో సోనాక్షితో పాటు అలియాభ‌ట్, మాధురి దీక్షిత్ కూడా న‌టిస్తున్నారు. మొత్తానికి హిట్స్ ఉన్న‌పుడు అంటే గ్లామర్ షో చేసినా.. చేయ‌క‌పోయినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిగారి గోల్డెన్ డేస్ పూర్తైపోయి.. బ్యాడ్ డేస్ మొద‌ల‌య్యాయి. దాంతో క్యాస్ట్యూమ్ సైజ్ త‌గ్గిస్తుంది ఈ భామ‌. అవ‌కాశాల కోసం విలువలు ప‌క్క‌న‌బెట్టి వ‌లువ‌లు త‌గ్గించేస్తుంది సోనాక్షి.

కెరీర్ మొద‌ట్లో ఎక్స్ పోజింగ్ అంటే అంతెత్తు ఎగిరిన‌ సోనాక్షి.. ఇప్పుడు అడ‌క్క‌పోయినా ప్ర‌తీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇక ఆ మ‌ధ్య‌ సిడ్నీ బీచ్ లో చిట్టి నిక్క‌రు.. తొడ‌లు క‌నిపించేలా షార్టులు వేసుకుని మ‌తులు పోగొట్టింది సోనాక్షి. ఇప్ప‌డు కూడా అడ‌క్క‌పోయినా హాట్ షో చేస్తూ మ‌తులు చెడ‌గొట్ట‌డానికి రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఎవ్వ‌రైనా.. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా అవ‌కాశాల కోసం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు అని సోనాక్షిని చూస్తే అర్థ‌మైపోతుంది క‌దూ.

More Related Stories