English   

మెగాస్టార్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ

Sonakshi Sinha
2021-06-24 13:57:33

మెగాస్టార్ చిరంజీవి రెండవ ఇన్నింగ్స్ లో కుర్ర హీరోలకు పోటీగా వరుసపెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో చిరు నటిస్తున్నాడు. ఇందులో లో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకు మణిశర్మ స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇక విడుద‌ల చేసిన లాహే లాహే పాట శ్రోత‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. 

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా పూర్తయిన వెంటనే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ లో న‌టిస్తాడు. ఆ త‌ర‌వాత‌ బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా లో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం దర్శకుడు బాబీ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ని సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఒక వేళ ఈ వార్త గ‌న‌కే నిజమే అయితే తెలుగులో సోనాక్షి సిన్హా నటించబోయే మొదటి సినిమా అవుతుంది.

More Related Stories