English   

సోనాలి బెంద్రేకు స్టేజ్ -4 క్యాన్సర్ 

Sonali-Bendre

ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు వంటి సినిమాలతో తెలుగువారి మనసులు దోచిన బ్యూటీ సోనాలి బెంద్రే. బాలీవుడ్ లో ఓ దశలో టాప్ లీగ్ లో వెలిగిన ఈ భామకు సడెన్ గా క్యాన్సర్ అటాక్ అయిందన్న వార్త సంచలనమవుతోంది. అయితే ఇదేమీ రూమర్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్వీట్ చేసింది. అవును.. సోనాలిబెంద్రే ఓ అరుదైన క్యాన్సర్ బారిన పడింది. అది కూడా ఇప్పుడు స్టేజ్ ఫోర్ లో ఉందని తనే తెలిపింది. ఈ హైగ్రేడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఈ మధ్యే తను డయోగ్నటైజేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో న్యూ యార్క్ లో చికిత్స తీసుకుంటోంది. 

ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్ ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. ఇప్పడు సోనాలి బెంద్రే కూడా అలాంటి అరుదైన క్యాన్సర్ బారిన పడటం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. చాలాకాలం క్రితమే పెళ్లి చేసుకున్న సోనాలి బెంద్రే న్యూయార్క్ లోనే సెటిల్ అయింది. అయితే సోనాలికి క్యాన్సర్ అనగానే చాలామంది బంధువులు స్నేహితులు సహజంగానే బాధపడుతున్నాడు. కానీ తను మాత్రం చాలా ధైర్యంగా తను ఈ మహమ్మారితో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. ఖచ్చితంగా గెలుస్తాను అంటూ చాలా ధైర్యంగా ప్రకటించింది. ఏదేమైనా ఈ మధ్య సినిమా తారలు చాలా వరకూ క్యాన్సర్ బారిన పడుతుండటం కలచి వేస్తోంది. ముఖ్యంగా మహిళ నటీమణులకే ఈ క్యాన్సర్ కు ఎక్కువగా గురవుతున్నారు.

More Related Stories