English   

నానీ దాచిన రహస్యం.. ఇదేనా..?

Nani-I-Wanna-Fly
2018-04-09 18:35:32

నేచురల్ స్టార నాని లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకుంది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయ్. ట్రైలర్ అంచనాలు పెంచేసింది. నాని డ్యూయొల్ రోల్ కు త్రిపుల్ హ్యాట్రిక్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 12న వస్తోన్న ఈ యుద్ధానికి ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నాడు నాని. అందుకే రేపు సాయంత్రం మరో పాట విడుదల చేయబోతున్నాడు. అది వీడియో సాంగ్. అంటే పూర్తి పాట కాదులెండి. ప్రోమోలాగా అన్నమాట. అలాగని మరీ చిన్నదేం కాదు.. నిమిషానికి పైనే ఉంటుందని టాక్. ఏప్రిల్ 9 సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయబోయే ఆ పాట ‘ఐ వాన్నా ఫ్లై’. ఆల్రెడీ ఆల్బమ్ లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీడియోలో ఎలా ఉంటుందనే టేస్ట్ సాయంత్రం నాలుగు గంటలకు తెలుస్తుందన్నమాట. 

తమిళ్ కుర్రాడు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించిన కృష్ణార్జున యుద్ధానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ మూవీతో గాంధీ కూడా హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడు. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి ఈ మూవీలో నాని పాత్ర బావా బావమరిదులుంగా ఉంటుందని టాక్. అదే నిజమైతే ఇదో పెద్ద సెన్షేషన్ అవుతుంది. ఇప్పటి వరకూ మనం చూసిన చాలా సినిమాల్లో ఒకేలా ఉన్న ఇద్దరు దాదాపు అన్నదమ్ములే అవుతారు.కనీసం దూరపు చుట్టాలైనా అయి ఉంటారు. ట్రైలర్ లో కూడా ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ను ఏ మాత్రం రివీల్ కానీయలేదు. పైగా ఇద్దరివీ వేర్వేరు దేశారు. అలాంటి ఇద్దరు అన్నదమ్ములైతే అది హలో బ్రదర్ అవుతుంది. అలా కాదు ఇలా ఏకంగా బావా బావామరుదులంటే మాత్రం ఇదో కొత్త రకం సినిమా అవుతుంది. మరి అంత ధైర్యం నాని చేస్తాడా అంటే చేసినా చేయొచ్చు. అసలే కథ బావుంటే దేనికైనా రెడీ అనే టైప్ మనోడు.

More Related Stories