English   

నవరాత్రి ఉత్సవాల్లో సోనూ విగ్రహం

Sonu Sood
2020-10-24 09:47:52

లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించి వారి పాలిట దేవుడయ్యాడు సోనూసూద్. ప్రత్యక బస్సులు ఏర్పాటు చేసి దగ్గరుండి మరీ సోనూ సొంత గ్రామాలకు పంపించాడు. లాక్ డౌన్ తరవాత కూడా తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఓ నిరుద్యోగి ఉద్యోగం లేక కూరగాయలు అమ్ముతుండటం చూసి సోనూ ఆమెకు అన్నగా మారి ఉద్యోగాన్ని ఇప్పించాడు. ఏపీలో ఓ రైతు కాడెద్దులు లేక తన కూతుళ్ళ సహాయంతో పొలం దున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా సోనూ కంట పడటంతో వెంటనే స్పందించి సాయంత్రానికల్లా వారి ఇంటికి ట్రాక్క్టర్ ను పంపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ సేవలు ఎన్నో ఉన్నాయి. ఇక సోనూసూద్ చేస్తున్న సహాయం పై ఆయన పై అభిమానంతో ఓ యువకుడు దేవుళ్ళ పక్కన సోనూ ఫోటో పెట్టి పూజలు చేసాడు. 

ఇక తాజాగా ఏకంగా సోనూ విగ్రహాన్నే ఏర్పాటు చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో చోటుచేసుకుంది. కోల్ కత్తాలో ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలలో సోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కార్మికులకు చేసిన సహాయం ప్రతిబింబించేలా ఓ సెట్ ను వేశారు. అందులో సోనూ కార్మికులకు సహాయం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిపై తాజాగా సోనూ స్పందించారు. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదే అని పేర్కొన్నారు.

More Related Stories