English   

సోనూసూద్ కు క‌రోనా పాజిటివ్

Sonu Sood
2021-04-17 14:15:06

రియ‌ల్ హీరో సోనూసూద్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని సోనూసూద్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఈ రోజు ఉద‌యం త‌న‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని సోనూసూద్ పేర్కొన్నారు. ముందు జాగ్ర‌త్తగా తాను క్వారంటైన్ లోకి వెళ్లిన‌ట్టు సోనూసూద్ తెలిపారు. త‌న ఆరోగ్యం గురించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎవ్వ‌రూ కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని ఇది ప్ర‌జ‌ల స‌మస్య‌లు తీర్చ‌డానికి కావాల్సినంత స‌మ‌యాన్ని ఇస్తుంద‌ని అన్నారు. అంతే కాకుండా మీ అంద‌రి కోసం నేనున్నా గుర్తుంచుకోండి అంటూ ట్వీట్ చేశారు. 

కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సోనూసూద్ ఇత‌రుల గురించి ఆలోచించడం గొప్ప విష‌యం అని చెప్పాలి. ఇదిలా ఉండగా సోనూసూద్ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌ను త‌మ సొంత గ్రామాల‌కు త‌ర‌లించి వారికి రియ‌ల్ హీరోగా మారారు. అప్ప‌టి నుండి సినిమాల్లో విలన్ పాత్ర‌ల్లో న‌టించే సోనూసూద్ ను రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణిస్తున్నారు. అంతే కాకుండా లాక్ డౌన్ త‌ర‌వాత కూడా సోనూ సూద్ సేవాకార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మందికి ఆప‌రేష‌న్లు చేయించారు. అంతే కాకుండా త‌న పేరుతో ఇటీవ‌లే అంబులెన్స్ ల‌ను సైతం ప్రారంభించారు. 

More Related Stories