English   

క్రాక్ హిందీ రీమేక్ లో సోనూసూద్

Sonu Sood
2021-01-16 14:40:19

లాక్ డౌన్ వేళ మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలతో నటుడు సోనూసూద్ రియల్ హీరోగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. లాక్ డౌన్ వేళ నగరాల్లో ఉన్న వలస కూలీలను తన సొంత డబ్బుతో సోనూ ఇళ్లకు పంపించారు. అంతే కాకుండా నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడటం చూసి సొంతగా క్యాబ్ లను ఏర్పాటు చేశారు. అప్పుడు మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను ఆయన ఇప్పటికి కొనసాగిస్తున్నారు. కాగా తమ అభిమాన సోనూ సూద్ ను అంతా సినిమాల్లో విలన్ గా కాకుండా హీరోగా గా చూడాలని ఆశపడుతున్నారు. సోషల్ మీడియాలో సోనూసూద్ హీరోగా చేయాలని కోరారు. మరోవైపు సోనూసూద్ కు కూడా సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే సూనుసూద్ ఇటీవల విడుదలైన "క్రాక్" సినిమా హిందీ రీమేక్ లో హీరోగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి  దర్శకత్వం వహించారు. సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడమే కాకుండా సోనూసూద్ కు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చిందట. దాంతో క్రాక్ తో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సోనూ నిర్ణయించుకున్నారని టాక్. ఇప్పటికే క్రాక్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు తో సోనూసూద్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. అంతా సెట్ అయితే సోనూసూద్ రీల్ హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇక హీరోగా ఎంట్రీ ఇస్తున్న సోనూ బాయ్ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి.

More Related Stories