English   

ర‌జినీ ఇంట పెళ్లిబాజాలు.. సౌంద‌ర్య రెండో పెళ్లి.. 

Soundarya-Rajinikanth
2018-11-14 16:23:03

ర‌జినీకాంత్ ఇంట మ‌రోసారి పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయి. ఆయ‌న రెండో కూతురు సౌంద‌ర్య ర‌జినీకాంత్ రెండో పెళ్లి చేసుకోబోతుంది. ఈ విష‌యం చాలా సీక్రేట్ గా ఉంచారు కుటుంబ స‌భ్యులు. త‌మిళ‌నాడు బిజినెస్ మ్యాన్ క‌మ్ యాక్ట‌ర్ విషాగ‌న్ వ‌నంగ‌మూడితో సౌంద‌ర్య మూడు ముళ్లు వేయించుకోడాని సిద్ధ‌మ‌వుతుంది. ఈ మ‌ధ్యే వీళ్ల నిశ్చితార్థం కూడా చ‌డీ చప్పుడు లేకుండా జ‌రిగింద‌ని తెలుస్తుంది. దీనికి చాలా త‌క్కువ మంది హాజర‌య్యారు. సౌందర్యకు 2010లో త‌ను ప్రేమించిన అశ్విన్ కుమార్ తోనే పెళ్లైంది. వీళ్ల‌కు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే త‌ర్వాత మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా అశ్విన్ తో విడాకులు తీసుకుని కొడుకుతో క‌లిసి జీవిస్తుంది సౌంద‌ర్య‌. 

ఇప్పుడు మ‌ళ్లీ విషాగన్ వనంగముడితో ప్రేమ‌లో ప‌డింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జనవరిలో జ‌ర‌గ‌నుందని తెలుస్తుంది. మ‌రోవైపు విషాగన్ కి కూడా ఇది రెండో పెళ్లే.. అతడి తొలి భార్య‌తో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు సౌంద‌ర్య‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈయ‌న కొన్ని తమిళ సినిమాల్లో న‌టించాడు. అయితే ఏదీ పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ పెట్టుకుని బిజినెస్ తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు సౌంద‌ర్య మాత్రం ద‌ర్శ‌క‌త్వంపై ప‌ట్టు సాధించే క్ర‌మంలో ఉంది. ఈ మ‌ధ్యే బావ ధ‌నుష్ హీరోగా విఐపి 2 సినిమా చేసింది.. అది ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు తండ్రితో మ‌రో సినిమా కోసం క‌థ సిద్ధం చేసుకుంటుంది ఈమె. ఇప్పుడు పెళ్లితో మ‌ళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది సౌంద‌ర్య ర‌జినీకాంత్.

More Related Stories