English   

బాలు కొత్త గళం ఇళయరాజా వల్లేనా..?

SP-Balasubramaniam-isra
2018-08-08 19:09:50

కొన్ని గొడవలు అనుకోని డిమాండ్స్ కు దారితీస్తాయి. మరికొన్ని గొడవలు ఇంటర్నల్ గా రివెంజ్ మిక్స్ అయి నలుగురికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఇప్పుడీ రెండో కోవకు చెందిన విధంగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సరికొత్తగా గళం విప్పుతున్నాడు. ఇందుకోసం తోటి సింగర్స్ తో  కలిసి ఓ కొత్త సంఘం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో డైరెక్ట్ గా ఎక్కడా ఆయన పేరు లేదు. కాకపోతే ఈ సింగర్స్ సంఘానికి బ్యాక్ బోన్ ఆయనే. కొన్నాళ్లుగా ఓ సినిమాలోని పాటకు సంబంధించిన రాయల్టీ విషయంలో దక్షిణాదిలో గొడవలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇళయరాజా అండ్ బాలు. ఈ కథ గురించి తర్వాత మాట్లాడుకుంటే ప్రస్తుతం సింగర్స్ అంతా కలిసి ‘‘ఇస్రా’’ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. 

ఇస్రా అంటే ‘ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్’ అన్నమాట. వీళ్లంతా కలిసి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఇస్రా నుంచి మీట్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇక వీరి డిమాండ్స్ ను చూస్తే ఖచ్చితంగా ఇది ఇళయారాజా గొడవ తర్వాత వచ్చిన ఆలోచన అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. వీరి డిమాండ్స్ లో ప్రధానంగా అవే ఉన్నాయి. రాయల్టీ చట్ట ప్రకారం ఖచ్చితమైన చర్యలు అమలు కావాలనేది వీరి డిమాండ్. 

ఈ రాయల్టీ చట్టం 2012లో ఏర్పడింది. కానీ ఈ విషయంపై సింగర్స్ కు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సంగీత దర్శకులతో ఇబ్బందులు పడుతున్నారనేది బాలు చెప్పిన విషయం. ఇప్పటి వరకూ రాయల్టీకి అర్హులుగా ఒక పాటపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులున్నాయి. ఈ రాయల్టీ చట్టం ప్రకారం పాటపై గాయకులకు కూడా హక్కుండాలి. కానీ అలా జరగడం లేదు. అందుకే సింగర్స్ అంతా కలిసి రాయల్టీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని గళమెత్తారు. ఇక ఈ విషయంలో గాయకులు కూడా స్పష్టమైన అవగాహనతో ఉండాలని సూచించాడు బాలసుబ్రహ్మణ్యం. మరి ఈ విషయంలో సంగీత దర్శకుల సంఘం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

More Related Stories