English   

బాల‌య్య‌.. ఎన్టీఆర్ సినిమా ముచ్చ‌ట్లు

Sr ntr and balakrishna
2018-03-05 18:44:39

నంద‌మూరి బాల‌య్య ప్ర‌స్తుతం కాస్త రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఎప్పుడూ సినిమాల‌తో బిజీగా ఉండే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అసెంబ్లీ స‌మావేశావ‌ల‌కు చేతికి క‌ట్టుతో ద‌ర్శ‌న‌మిచ్చాడు బాల‌య్య‌. చేతికి ఆ మ‌ధ్య ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు బాల‌య్య‌. అదే క‌ట్టుతో వ‌చ్చాడు. ఇక ప‌నిలో ప‌నిగా ఎన్టీఆర్ బ‌యోపిక్ ముచ్చ‌ట్లు కూడా చెప్పాడు బాల‌య్య‌. ఈ చిత్రాన్ని మార్చ్ 29న ప్రారంభిస్తామ‌ని చెప్పాడు బాల‌య్య‌. అది కూడా హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో సినిమా మొద‌ల‌వుతుంద‌ని చెప్పాడు ఈ నంద‌మూరి వార‌సుడు. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ సినిమా ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని.. దీన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పాడు బాల‌య్య‌. ఈ సినిమా టైటిల్ కోసం చాలా మంది చాలా పేర్లు సూచించినా ఎన్టీఆర్ ను మించిన మంచి పేరు లేదని భావించి ఆ పేరే ఖరారు చేసామ‌ని చెప్పాడు బాల‌య్య‌. పార్టీలకు అతీతంగా అందరూ ఎన్టీఆర్ ని అభినందించిన వారే కాబ‌ట్టి త‌మ సినిమా అంద‌ర్నీ అల‌రిస్తుంద‌ని చెప్పాడు బాల‌య్య‌. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌కుడు. ఆగ‌స్ట్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రంలో మిగిలిన క్యాస్టింగ్ ఎవ‌రు అనేది ఇంకా కన్ఫ‌ర్మ్ కాలేదు. మొత్తానికి చూడాలిక‌.. ఎన్టీఆర్ గా బాల‌య్య ఎలా ఉండ‌బోతున్నాడో.. ?

More Related Stories