English   

 ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ ఒక్క‌డే ఉన్నాడా..?

Sri Reddy-pawan
2018-04-18 07:13:24

ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోగా ఉన్న‌పుడు ఆయ‌న అడుగేస్తే కోట్లు రాలాయి. విజ‌యం వ‌స్తే రికార్డులు దరిచేరాయి. హిట్టు ఫ్లాపుల‌తో ప‌నిలేని ఇమేజ్ ఆయ‌న సొంతం. అలాంటి వాడు ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. వ‌చ్చిఏదో చేయాల‌ని  తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. ఆయ‌న్ని స‌పోర్ట్ చేయాల‌నుకున్న వాళ్లు చేస్తున్నారు.. విమ‌ర్శించే వాళ్లు విమ‌ర్శిస్తున్నారు. అయితే రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న్ని సద్విమ‌ర్శ‌లు చేస్తున్న‌వాళ్లు ఉన్నారు కానీ సినిమా ఇండ‌స్ట్రీలోనే ప‌వ‌న్ పేరును వాడుకుని పైకి రావాల‌ని కొంద‌రు నీచ‌పు ఆలోచ‌న‌ల‌తో ఉన్నారు. ప‌వ‌న్ పేరు వాడుకుని రాత్రికి రాత్రే బిచ్చ‌గాడి వ‌ర‌కు తెలిసిపోయిన ఓ సుత్తి సుబ్ర‌మ‌ణ్యం మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. మ‌రో ప‌నేది లేన‌ట్లు ఓ ప‌నికిమాలిన ఛానెల్ లో కూర్చుని ప‌వ‌న్ ఫ్యాన్స్ న‌న్ను కొట్టారు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ న‌న్ను గిల్లారు అంటూ అస్త‌మానం ఆడ‌పిల్లి ఏడ్చిన‌ట్లు ఏడ్చాడు. కేవ‌లం ప‌వ‌న్ పేరు వాడుకుని ఆయ‌న ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఇరిటేటింగ్ ప‌ర్స‌న్ అవార్డు గెలుచుకున్నాడు. 

ఇక ఇప్పుడు మ‌రో లేడీ సుత్తి సుబ్ర‌మ‌ణ్యం వ‌చ్చింది. ఈమె కూడా ప‌వ‌న్ ను వాడేసుకుంటుంది. ఇన్నాళ్లూ తెలుగమ్మాయిల‌కు న్యాయం జ‌ర‌గాలి.. దానికోసం నేను బ‌ట్ట‌లు కూడా విప్పేస్తానంటూ న‌డిరోడ్డు మీద బ‌ట్ట‌లు తీసేసిన మ‌హా ప‌తివ్ర‌త ఆమె. ఇండ‌స్ట్రీలో ఎవ‌రు పిలిచినా కూడా లేద‌న‌కుండా వెళ్లి.. తర్వాత మోస‌పోయాన‌ని తెలుసుకున్న ప‌ర‌మ అమాయ‌కురాలు ఆమె. ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఆమెకు క‌ళ్లు తెరుచుకున్నాయి. అందుకే ఇన్నాళ్లూ ఓ కాజ్ కోసం బ‌ట్ట‌లిప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సంబంధం లేక‌పోయినా ఈ ఇష్యూలోకి ప‌వ‌న్ ను తీసుకొచ్చింది. ఏకంగా ఆయ‌న్ని అన‌రాని ఓ పెద్ద బూతుమాట అనేసింది. న్యాయం జ‌ర‌గాలంటే పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాలి కానీ మీడియాకు కాదు అని ప‌వ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పేం క‌నిపించిందో  మరి.. ఆయ‌న్ని తిట్టిపోస్తుంది. 

అలా పాపుల‌ర్ కావాల‌ని చూస్తుంది. ఈ ద‌రిద్రాన్ని మ‌ళ్లీ కొన్ని మీడియా సంస్థ‌లు పెంచి పోషించ‌డం..? ఏంటో ఈ నీచం..? ఇదే తెలుగు ఇండ‌స్ట్రీలో బాల‌య్య‌.. బాబూమోహ‌న్.. ముర‌ళీమోహ‌న్.. చిరంజీవి లాంటి వాళ్లు కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు క‌దా..? మ‌రి వాళ్ల‌నెందుకు నిల‌దీయ‌డం లేదు ఈ శ్రీ‌శ‌క్తి. ఒక్క ప‌వ‌న్ ను మాత్ర‌మే ఎందుకు టార్గెట్ చేస్తుంది..? ఎందుకంటే వాళ్ల‌ను అడిగితే ఫ్యాన్స్ వ‌చ్చి తంతారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏం అన‌రు కాబ‌ట్టి..? అదేనా వీళ్ల ధైర్యం..? ఈ విష‌యాల‌న్నీ ప‌వ‌న్ సీరియ‌స్ గా తీస‌కోవ‌డం లేదు కాబ‌ట్టి అదేదో సినిమాలో ప్ర‌భాస్ చెప్పిన‌ట్లుగా అత్తారింటికి వ‌చ్చెళ్లిన‌ట్లు వెళ్తున్నారు. కానీ ఒక్క‌సారి ఇష్యూ సీరియ‌స్ అయితే ఒక్కొక్క‌రిగి ప‌గిలిపోవ‌డం మాత్రం ఖాయ‌మేనేమో..? 

More Related Stories