శేఖర్ పై శ్రీ రెడ్డి ఎఫెక్ట్

ఒక బ్లాక్ బస్టర ఇచ్చిన దర్శకుడు నెలల తరబడి ఖాళీగా ఉండటం టాలీవుడ్ లోనే కాదు ఏ ఉడ్ లో అయినా రేర్ గా చూస్తుంటాం. .. అలాంటిది లాస్ట్ ఇయర్ ఓ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ములకు ఇంత వరకూ మరో నిర్మాత దొరకలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి అప్పుడు శేఖర్ నెక్ట్స్ సినిమా కూడా దిల్ రాజే నిర్మిస్తాడనే ప్రచారం సాగింది. కానీ కథ నచ్చితే కానీ ఓకే చెప్పని దిల్ రాజు ఇన్నాళ్లూ శేఖర్ ను వెయిట్ చేయించాడంటే నమ్మలేం. ఎందుకంటే అప్పుడు శేఖర్ తన వద్ద రెడీగా మరో స్క్రిప్ట్ ఉందని చెప్పాడు. మామూలుగా శేఖర్ కమ్ముల కథలకు నో చెప్పే వాళ్లు తక్కువ. పైగా శేఖర్ సెన్సిటివ్ స్టోరీస్ కు, దిల్ రాజు టేస్ట్ కు సరిపోతుంది. అయినా ఇంత వరకూ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో శేఖర్ ఏమీ అనౌన్స్ చేయలేదు. కారణం శ్రీ రెడ్డి అంటున్నారు.
శ్రీ రెడ్డి చాలా రోజుల క్రితమే శేఖర్ కమ్ముల గురించి ఇన్ డైరెక్ట్ గా కొన్ని కమెంట్స్ చేసింది. శేఖర్ తో పాటు చాలామంది గురించి ఆమె మాట్లాడింది. కానీ శేఖర్ మాత్రమే సడెన్ గా రియాక్ట్ అయ్యాడు. లీగల్ యాక్షన్ తీసుకుంటా అన్నాడు. కానీ అలాంటిదేం చేయలేదు. దీంతో గుమ్మడికాయల దొంగల చందాన అతను దొరికాడా అనే ఊహాగానాలు కూడా వినిపించాయప్పట్లో. ఏదేమైనా శ్రీ రెడ్డి విషయంలో శేఖర్ కమ్ముల చాలా డిస్ట్రబ్ అయ్యాడని.. అందుకే రెడీగా ఉన్న కథకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేక ఇబ్బంది పడుతు్నాడు అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన బెడితే.. అన్నీ అబద్ధాలే అని చెబితే. మరి ఇంత కాలం శేఖర్ కమ్ములు కొత్త సినిమా ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నాడు అనేది గమనించాల్సి విషయం. మొత్తంగా శేఖర్ కమ్ముల కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టినా.. శ్రీ రెడ్డి ఇన్ డైరెక్ట్ గా ఏదో ఒక కమెంట్ చేస్తుందనేది నిజం. దానికి భయపడి శేఖర్ ఇ్నాళ్లూ కామ్ గా ఉన్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా శ్రీ రెడ్డి.. శేఖర్ కమ్ముల వంటి జెంటిల్మన్ ను డిస్ట్రబ్ చేసిందదని ఇండస్ట్రీలో గుసగుసలుపోతున్నారు జనం.