English   

శ్రీ‌రెడ్డి దృశ్య కావ్యం.. పైత్యానికి ప‌రాకాష్ట..

Sri Reddy Leaks Base Changed From Tollywood to Tamil Film Industry
2018-08-22 11:39:51

ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్య‌క్తి ఓ గొప్ప‌వాడో.. లేదంటే ఆయ‌న నుంచి స‌మాజం ఎంతోకొంత నేర్చుకోవాల‌నో ఉద్దేశ్యం అయితే ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌నిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. బ‌యోపిక్ అంటే డ‌బ్బులు దండుకోవ‌డం.. బిజినెస్ చేయడం. సినిమా ఎలాగూ బిజినెస్ అయిపోయింది.. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ క‌నీసం కొద్దోగొప్పో విలువ‌లు అయితే ఇంకా ఉన్నాయ‌నే న‌మ్ముతున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు వ‌స్తోన్న కొన్ని ప‌రిస్థితుల‌ను సినిమాల‌ను చూస్తుంటే అవి లేవేమో అని భ‌యం కూడా వేస్తుంది. శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ కు శ్రీకారం చుట్ట‌డం చూస్తుంటే ఇది నిజం కాదా అని అడుగుతున్నారంతా.

శ్రీ‌రెడ్డి బ‌యోపిక్ చేయాల్సినంత గొప్ప ఫిగ‌ర్ అయితే కాదు క‌దా..! ఫిగ‌ర్ అంటే ఇక్క‌డ విలువలున్న మ‌నిషి అని అర్థం. పైగా ఈమె బ‌యోపిక్ కు మ‌ళ్లీ అమ్మ ఆశీస్సులు ఒక‌టి. చెన్నై జ‌య‌ల‌లిత ఆశీసుల‌తో రెడ్డిడైరీ మొద‌లైంది. మ‌న ద‌గ్గ‌ర ఉంటూ.. మ‌న ఇండ‌స్ట్రీ ప‌రువు మొత్తం తీసిన శ్రీ‌రెడ్డిపై ఇప్పుడు సెల్వం అనే అరవ ద‌ర్శ‌కుడు బ‌యోపిక్ చేస్తున్నాడు. మ‌రి ఈ సినిమాలో ఎలాంటి నిజాలు చూపిస్తారో.. ఎలాగూ రోడ్ల‌పై న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా చేసింది క‌దా.. అవి కూడా సినిమాలో ఉంటాయేమో..? అస‌లు బ‌యోపిక్ అనే ప‌దానికి అర్థం లేకుండా చేస్తున్నాయి ఈ మ‌ధ్య వ‌చ్చే కొన్ని బ‌యోపిక్ లు. ఇక చూడాలి.. శ్రీ‌రెడ్డి గారి అద్భుతమైన సుందర దృశ్య కావ్యం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories