English   

చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టిన ప‌తివ్ర‌త‌

Sri Reddy Mallidi

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న‌ది ఒక్క‌రే ఒక్క‌రు ప‌తివ్ర‌త‌.. ఆవిడే శ్రీ‌రెడ్డి. తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని ఉతికేసింది క‌దా.. అందుకే ఇప్పుడు చెన్నై వెళ్లింది. అయితే మ‌నంత మంచి వాళ్లు కాదు అర‌వోళ్లు. అందుకే వెళ్లీ వెళ్ల‌గానే తోక జాడిస్తే తోలు తీస్తామంటూ వార్నింగులు ఇచ్చారు త‌మిళోళ్లు. చెన్నైకి వెళ్లి అక్క‌డ ఓ ఇంట‌ర్వ్యూలో అక్క‌డి వాళ్ల‌పైనే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేసింది శ్రీ‌రెడ్డి. ముఖ్యంగా అక్క‌డి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగ‌దాస్.. ఖుష్బూ భ‌ర్త, ద‌ర్శ‌కుడు సుందర్ సి.. స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ ఇలా చాలా మందిపై నోరు పారేసుకుంది శ్రీ‌రెడ్డి. అస‌లే గ‌తేడాది సుచీలీక్స్ తో త‌మిళ ఇండ‌స్ట్రీ ప‌రువు అంతా పోయింది. అక్క‌డ అంతా హీరోయిన్లు చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగు తార‌ని భారీ డైలాగులు వేసింది శ్రీ‌రెడ్డి.

సుచీలీక్స్ త‌ర్వాత శ్రీ‌లీక్స్ కూడా ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్నాయి. త‌మిళ ఇండ‌స్ట్రీపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు నోరు జారితే బాగుండ‌ద‌ని నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్.. ట్రెజరర్ కార్తీలు శ్రీరెడ్డిని హెచ్చరించినా కూడా ఆమె త‌గ్గ‌డం లేదు. చెన్నైలో మకాం పెట్టి ఎప్పుడు ఎవ‌రిపై బాంబ్ వేయాల‌నుకుంటుందో కూడా హింట్ ఇవ్వ‌డం లేదు శ్రీ‌రెడ్డి. ఇప్ప‌టికే చెన్నైలో శ్రీ‌రెడ్డిపై కేస్ కూడా ఫైల్ అయింది. త‌మిళ న‌టుడు వారాహి ఈమెపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసాడు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా వాళ్ల‌ను బెదిరించి డ‌బ్బులు గుంజుకుంద‌ని.. తెలుగు ఇండ‌స్ట్రీ అయిపోయే స‌రికి ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీపై ప‌డింద‌ని శ్రీ‌రెడ్డిపై సీరియ‌స్ అయ్యాడు వారాహి. ప‌రిస్థితి చూస్తుంటే అక్క‌డ శ్రీ‌రెడ్డిని అంత ఈజీగా వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.

More Related Stories