English   

ఛీ రెడ్డి అంటున్నారంతా..?

sri-reddy

మాట అదుపుతప్పితే మనిషి లోకువవుతాడు. ఇన్నాళ్లూ శ్రీ రెడ్డిపై కొంతమందికైనా సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలతో ఆమె ‘రేంజ్’ఏంటనేది తెలిసిపోయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం తనపై రివర్స్ అవుతోంది. ఏకంగా నిన్నటి వరకూ ఆమెకు సపోర్ట్ చేసిన వారు కూడా ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. మాధవీలత ఆమె మాటలను వ్యతిరేకిస్తూ మౌనదీక్ష మొదలుపెట్టింది. నిన్నటికి నిన్న జీవిత ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన మాటల్లో అద్భుతమైనది.. ‘ఒక్కసారి పడుకుంటే కాస్టింగ్ కౌచ్.. పదేళ్లూ అదే పనిచేస్తే’.. అనేది. యస్.. ఇన్నాళ్లుగా ఇదే పనితో ఎన్నో సంపాదించుకున్న ఆమెకు సడెన్ గా తను కోల్పోయిన శీలం గుర్తొచ్చిందా అని కడుగుతున్నారు చాలామంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. 

ఇండస్ట్రీలోని ఆర్టిస్టులతో మొదలై మారుమూల గ్రామాల వరకూ శ్రీ రెడ్డిని ఛీ రెడ్డి అంటూ ఓ ఆటఆడుకుంటున్నారు. ఇక మహాటివిలో నిన్న జరిగిన చర్చలో హ్యూమనిస్ట్ బాబు గోగినేని చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. ఆయన మాటల తర్వాత అక్కడ కూడా కొంత డ్రామా చేసిన శ్రీ రెడ్డి మొత్తంగా అడ్డంగా బుక్ అయిపోయిందనేది నిజం. ఈ వ్యవహారంలో ఆమె జీవితం ఎంత రచ్చగా మారిందనేది తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మరి ఇకనైనా ఈ సోది(మీడియా కూడా) ఆపితే బావుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

ఇవన్నీ గమనించి ఇవాళ పవన్ కళ్యాణ్ కు, ఆమె అమ్మగారికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ ట్వీట్ చేసింది. కానీ అవేవీ సరిపోవు.. నీ అసలు రంగు బయటపడింది. ఇక ఆపు నీ యవ్వరాలు అంటూ మళ్లీ కౌంటర్ ట్వీట్స్ కూడా మొదలయ్యాయి. అలాగే తను గతంలో చేసిన ఓ వీడియో చాట్ ను చాలామంది పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆ మాటలను బట్టి ఇంకా ఎవరికైనా ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే. ఒక ప్రాస్టిట్యూట్ కు ఏ మాత్రం తీసిపోని ప్రవర్తన ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రాస్టిట్యూట్ లు కూడా మనుషులే. కానీ దానికి మనదేశంలో చట్టబద్ధత లేదు కాబట్టి.. ఆమె చేసింది ముమ్మాటికీ తప్పే.  ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో టాలీవుడ్ లో చాలానే నేర్చుకుంది. అటు మీడియా కూడా నిస్సిగ్గుగా ఈ విషయంపై గంటల తరబడి చర్చలు పెడుతూ రచ్చరచ్చ చేసింది. దీనివల్ల శ్రీ రెడ్డికి పబ్లిసిటీ తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అనే కనీసం అవగాహన కూడా లేకపోవడం విచారం. 

More Related Stories