English   

బిచ్ నుండి హీరోయిన్ ని చేశారు...ధాంక్యూ

srireddy
2019-04-18 20:15:17

టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై గత కొంత కాలం క్రితం జరిగిన పోరాటం వలన  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్‌ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద సదరు పోరాటానికి ఆద్యులు అయిన శ్రీ రెడ్డి స్పందించింది. ఒక హైదరాబాద్ వ్యక్తిగా చాలా గర్వపడుతున్నానని, ఒక బిచ్ అన్న నోళ్ళు మూయించేలా నన్ను ఈ ప్రపంచానికి హీరోయిన్ చేశారు. తను చేసిన పోరాటానికి ఒక ఏడాదిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయని ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సంధ్య, వసుధ, సజయ వంటి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలని శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోరాటానికి అపూర్వ గుండె లాంటివారు అని ఆమె పేర్కొంది.

More Related Stories