English   

  శ్రీ‌రెడ్డి.. ఏంటీ ద‌రిద్రం..?

Sri-Reddy
2018-04-08 10:25:58

తెలుగు ఇండ‌స్ట్రీని ఎవ‌రైనా ఒక్క మాట అంటే మ‌నోళ్ల‌కు ఎక్క‌డ‌లేని కోపం వ‌చ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక్క న‌టి మాత్రం ఇండ‌స్ట్రీ ఇజ్జ‌త్ మొత్తం తీస్తుంది. మ‌న ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌ట్టలిప్పేస్తుంది. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీ‌రెడ్డి ఎందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుంది..? ఎందుకు ఇంత‌గా రెచ్చిపోతుంది..? మ‌రీ ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లిప్పేంత త‌ప్పు మ‌న ఇండ‌స్ట్రీ ఏం చేసింది..? ఇన్నాళ్లూ నోరు మూసుకున్న శ్రీ‌రెడ్డి ఇప్పుడు ఎందుకు రెచ్చిపోతుంది..? అంటే ఇన్నాళ్లూ క్యాస్టింగ్ కౌచ్ లేదా.. ఉన్నా నోరు విప్ప‌లేదా..? ఇప్పుడు శ్రీ‌రెడ్డి మాత్ర‌మే ఎందుకు ఇంత‌గా అన్యాయం జ‌రిగిన‌ట్లు అరుస్తుంది..? ఇండ‌స్ట్రీ ప‌రువు తీయాల్సిన అవ‌స‌రం ఏంటి..? త‌న‌కు ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు అంద‌రితోనూ రొమాన్స్ చేసిందా..? అంటూ ఇప్పుడు శ్రీ‌రెడ్డిపై రివ‌ర్స్ అటాక్ జ‌రుగుతుంది. ఇప్పుడు వ‌చ్చి తాను అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెడ‌తాను.. ఇండ‌స్ట్రీలో ఉన్నోళ్లంతా బ్రోక‌ర్లే.. హీరోలు కూడా అంతా అలాంటి వాళ్లే.. ప‌డుకోకపోతే ఇక్క‌డ ప‌న‌వ్వ‌దంటూ శ్రీ‌రెడ్డి చేసిన క‌మెంట్స్ పై ఇండ‌స్ట్రీ అంతా సీరియ‌స్ అవుతుంది. నాని.. శేఖ‌ర్ క‌మ్ముల లాంటి వాళ్లపై కూడా శ్రీ‌రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దానికంటే ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు అంద‌రూ చూస్తుండ‌గానే బ‌ట్టలిప్పి కూర్చోవ‌డం మాత్రం దారుణ‌మే. మ‌రి ఈ ర‌చ్చ‌కు ఎప్పుడు ఎండ్ కార్డ్ ప‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories