English   

బాలు మరణంపై టాలీవుడ్ దొంగ కన్నీరు..శ్రీరెడ్డి

 Sri Reddy
2020-09-30 17:15:27

ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి టాలీవుడ్ పై మరోసారి దుమ్మెత్తిపోసింది. ఇటీవల జరిగిన ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ పరిశ్రమ నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదని మండిపడింది. టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కారుస్తున్నారంటూ విరుచుకుపడింది. టాలీవుడ్ పై  ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ కామెంట్లు చేసింది. ఈ మేరకు ఆమె ఘాటు కామెంట్లతో వీడియో తీసి రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బాలు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని ఆయన మరణం తరవాత వెళ్లిపోయావా అన్నాయా అంటూ టాలీవుడ్ స్టార్లు దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపుకు హాజరవ్వలేదని తెలిపింది. ఆయన వాయిస్ లేనిదే టాలీవుడ్ లో మెగాస్టార్లు లేరు అన్నారు. అయితే ఫేమ్ వచ్చిన తరువాత ఆయనను ఇబ్బంది పెట్టడమే కాక కడసారి చూపుకు కూడా రాలేదని వ్యాఖ్యానించింది. 

మా అసోసియేషన్ నుండి ఒక్కడు కూడా రాలేదు..రావాలని ఉంటే చిరంజీవి లాంటి స్టార్లు రాలేరా అని ప్రశ్నించింది. తాను తెలుగు అమ్మాయిలా గర్వపఫుతున్నానని కానీ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోలేదని తెలిపింది. తాను కోలీవుడ్ నటిగా అంత్యక్రియలకు హాజరైనట్టు తెలిపింది. టాలీవుడ్ పెద్దలకు ఒక పద్ధతి పాడు తెలియదు అంటూ ఫైర్ అయ్యింది. అందరూ డబ్బు మాయలో పడిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళతారు కానీ కెరీర్ ని నిలబెట్టిన వారి అంత్యక్రియలకు రాలేరా అంటూ ప్రశ్నించింది. అంత్యక్రియలకు వస్తే కాదురా మీ గుమ్మం దాటినా కరోనా వస్తుంది..తూ.. అంటూ తిట్టిపోసింది.

More Related Stories