English   

 శ్రీ విష్ణు లుక్ సూపరంతే..!!

VBVR
2018-07-29 10:23:25

డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతోన్న యంగ్ స్టార్ శ్రీ విష్ణు. తన వయసుకు మించిన పాత్రల్లోనూ మంచి పరిణతి చూపించే ఈ యంగ్ స్టర్ లేటెస్ట్ గా ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్ నారా రోహిత్ తో కలిసి. ఈ ఇద్దరూ కలిసి నటించిన లాస్ట్ మూవీ అప్పట్లో ఒకడుండేవాడు సూపర్ మూవీగా పేరు తెచ్చుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాను విపరీతంగా పొగిడేశారు. తర్వాత కూడా మెంటల్ మదిలో, నీదీనాదీఒకే కథ వంటి మూవీతో మంచి విజయాలు అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు మరోసారి రోహిత్ తో కలిసి చేస్తోన్న సినిమా ‘వీరభోగ వసంత రాయలు’. ఇంద్రసేన అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న నారా రోహిత్, శ్రీయల ఫస్ట్ లుక్స్ విడుదల చేసిన టీమ్.. లేటెస్ట్ గా శ్రీ విష్ణు లుక్ ను విడుదల చేసింది. 

వీరభోగ వసంత రాయలులో శ్రీ విష్ణు లుక్ కూల్ గా అదిరిపోయిందనే చెప్పాలి. వర్షంలో తడుస్తూ తెల్లని గుర్రం పక్కన నల్లని డ్రెస్ లో ఉన్నాడు. వెనక పోనీ టెయిల్ ను మించిన హెయిర్ స్టైల్ కనిపిస్తోంది. మరి ఈ కథ ఏంటో కానీ.. ఈ మధ్య కాలంలో చాలామంది అటెన్షన్ ను వీళ్లు టైటిల్ తోనే గ్రాబ్ చేశారు. ఇక శ్రీ విష్ణు, నారా రోహిత్ ఓ  సినిమా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా అందులో కొత్త కంటెంట్ ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం చూపిస్తారో చూడాలి. 

More Related Stories