English   

రాత్రికి ముంబైకి శ్రీ‌దేవి భౌతిక‌కాయం..

sridevi-dead-body

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు శ్రీ‌దేవి షాక్ లోనే ఉంది. ఈ వార్త తెలిసినప్ప‌టి నుంచి అస‌లు మ‌నం వింటున్న‌ది నిజ‌మా క‌దా అని అంతా ఒక‌టికి రెండు సార్లు క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. నిజం అని తెలిసి అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఆమె అభిమానులు అయితే దేవున్ని కూడా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఇంకా దుబాయ్ లోనే ఉంది. ఆమె పార్థివ దేహం కోసం ప్ర‌త్యేకంగా త‌న స్పెష‌ల్ ఫ్లైట్ ను దుబాయ్ కు పంపించాడు అనిల్ అంబాని. ఫిబ్ర‌వ‌రి 26 రాత్రి ముంబైలోని త‌న స్వ‌గృహానికి శ్రీ‌దేవి పార్థివ దేహం రానుంది. ఈ రోజు అంతా అక్క‌డే ఆమె భౌతిక‌కాయం ఉంచ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 25నే రావాల్సి ఉన్నా కూడా దుబాయ్ లో జ‌రిగిన కొన్ని జాప్యం వ‌ల్ల ఇంకా రాలేదు. అక్క‌డ శ్రీ‌దేవి డెత్ స‌ర్టిఫికేట్ ఫిబ్ర‌వ‌రి 26 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇష్యూ అయింది.  ఫిబ్ర‌వ‌రి 27 ఉద‌యం ముంబైలోని మెహ‌బూబా స్టూడియోలో కాస‌పు శ్రీ‌దేవి పార్థివ‌దేహాన్ని అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆమె అంతిమ‌యాత్ర ప్రారంభం కానుంది. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ అన్ని ఇండ‌స్ట్రీల నుంచి ముంబైకి శ్రీ‌దేవిని చూడ్డానికి.. ఆమెకు నివాళులు అర్పించ‌డానికి బ‌య‌ల్దేరుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 27 మ‌ధ్యాహ్నం జుహూలోని శాంతాక్రాజ్ స్మ‌శాన వాటిక‌లో శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. తమిళనాడులోని శివకాశీలో 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మాయాంగేర్ అయ్యపాన్. సినిమాల్లోకి వచ్చాక ఆమె శ్రీదేవిగా మారారు. బాలనటిగా కందన్ కరుణ్ (తమిళ్)  సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. బాలనటిగా తెలుగు సినిమాల్లో నటించారు. 50 ఏళ్ల పాటు సినీ క‌ళామ‌త‌ల్లికి సేవ‌లు చేసిన శ్రీ‌దేవి.. ఇప్పుడిలా హ‌ఠాన్మ‌ర‌ణంతో అంద‌రికీ షాకిచ్చింది.

More Related Stories