English   

శ్రీదేవిది హత్యే... నా..?

sridevi
2018-02-27 15:13:36

నిన్నటి వరకూ అది ఆశ్చర్యం, షాక్. ఇప్పుడు రహస్యం అయింది. అతిలోకసుందరి శ్రీదేవి మరణం దేశాన్ని కుదిపివేసింది. సడెన్ డెత్ కాస్తా మిస్టీరియస్ డెత్ గా మారేసరికి ఎంటైర్ నేషన్ షాక్ అయింది. శ్రీదేవి మరణం వెనక వినిపిస్తోన్న కథనాల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కానీ.. తన పార్థీవ దేహం ఇంకా మనదేశానికి ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం విషాదంగా మారింది. అప్పుడెప్పుడో దివ్యభారతి తర్వాత శ్రీదేవి మరణమే ఇప్పుడు అత్యంత మిస్టీరియస్ అయిపోయింది..

అప్పటి వరకూ ఆడిపాడింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించింది.. ఏ మాత్రం నీరసంగా లేదనే విషయం ఆమె ఆఖరి వీడియోలు చూసిన ఎవరికైనా తెలుస్తుంది. మరి అంతలోనే మరణం అంటే.. అనుమానాలకు అనేక అవకాశాలున్నాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ అనే మాటతో ఒక్కసారిగా దేశంలోని ఆమె అభిమానుల్లో విషాదం ఆవరించింది. కానీ చనిపోయింది దుబాయ్ లో కదా.. వారి ఫార్మాలిటీస్ ను పూర్తి చేస్తోన్న టైమ్ లోనే షాకింగ్ విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. అసలు ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చిన దాఖలాలే లేవు.. టబ్ లో పడి చనిపోయింది అన్నారు. కానీ టబ్ లో పడి మరణించిందా.. లేక మరణించాకే టబ్ లో పడిందా అనే కోణంలో దుబాయ్ పోలీసులు చేస్తోన్న దర్యాప్తు సంచలనాలు సృష్టిస్తోంది.

ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేంతటి కథ శ్రీదేవి మరణం వెనక నడుస్తోంది. ఒక్కో విషయం ఒక్కో సంచలనంగా మారుతోంది. కానీ అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనేది తెలియాలి. అంటే పెళ్లికి ముందు కానీ, తర్వాత కానీ ఏదైన గొడవ జరిగిందా..? శ్రీదేవిని ఎవరైనా అవమానించారా..? కావాలనే తను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా..? లేక ఎవరైనా చంపేశారా.. ఇవన్నీ తెలియాలంటే ఆ రోజు జరిగిన విషయాలన్నీ తెలియాలి. కానీ చెప్పేదెవరు..? ఒకవైపు ఆ పెళ్లికి వచ్చినవారంతా బోనీకపూర్ కు దగ్గర బంధువులు. ఇవన్నీ చెబుతారా అంటే గ్యారెంటీ లేదు. మరోవైపు ఈ మరణానికి సంబంధించి ఇండియా నుంచీ ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అమర్ సింగ్ చెబుతోన్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

శ్రీదేవి చనిపోయిన రోజు రాత్రి సుమారు 12.40 గంటల ప్రాంతంలో బోనీకపూర్ అమర్ సింగ్ కు ఫోన్ చేశాడు. కానీ అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో అమర్ వాళ్ల ల్యాండ్ లైన్ కు చేశాడు. అప్పుడే శ్రీదేవి చనిపోయిన విషయం బోనీ కపూర్ గద్గద స్వరంతో స్వయంగా అమర్ కు చెప్పాడు. ఆ విషయం పై మాట్లాడ్డానికది సమయం కాదని అమర్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం తెలిసిన ఫస్ట్ పర్సన్ అమర్ సింగే కావాలి.. ఇవన్నీ కూడా అమర్ సింగే చెబుతున్నాడు. బోనీ ఫోన్ చేసిన విషయం గురించి అమర్ సింగ్ చెబుతున్నదాన్ని బట్టి ఇంకా చాలా విషయాలే అతనికి తెలుసనుకోవచ్చు. అది నిజమే అనేలా అమర్ కూడా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.

బోనీకపూర్-శ్రీదేవి కుటుంబంతో అమర్ సింగ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన చెప్పేదాన్ని బట్టి వీరి ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆర్థిక ఇబ్బందులూ లేవు.  అయితే శ్రీదేవి మరణించిన ఒక రోజు కంటే ముందు బోనీకపూర్, అమర్ సింగ్ లు లక్నోలో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అటెండ్ అయ్యారు. అక్కడ అమర్ సింగ్ కు అవమానం జరగడంతో ఆ సమ్మిట్ ను అతను బహిష్కరించి వెళ్లిపోయాడు. ఇటు బోనీ కపూర్ కూడా తన భార్యకు సర్ ప్రైజ్ విజిట్ ఇవ్వాలని అదే రోజు రాత్రి దుబాయ్ వెళ్లాడు. ఆ రాత్రే శ్రీదేవి చనిపోయింది. ఇవన్నీ అమర్ సింగ్ చెబుతున్నాడు. మరి బోనీకపూర్ వెళ్లాక శ్రీదేవి చనిపోవడం వెనక ఏమైనా కుట్ర కోణాలున్నాయా అనేది కూడా ఆలోచించాల్సిన అంశాలే. ఆయన సర్ ప్రైజ్ విజిట్ కు వెళ్లాడా.. లేక తన ‘‘ప్లాన్’ అమలు చేయడానికి వెళ్లాడా అనేది అనుమానించాల్సిన విషయమే. అయితే ఇవన్నీ పోలీస్ ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్ లో తేలతాయి. కానీ బోనీకపూర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. అంతా అనుకుంటున్నట్టు ఇప్పటి వరకూ బోనీని దుబాయ్ పోలీస్ లు ఇంటరాగేషన్ చేయలేదు. కానీ ఇవాళ దుబాయ్ లోని బూర్ పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పారు.

ఫైనల్ గా ఈ ఇష్యూలో ఫినిషింగ్ టచ్ శ్రీదేవివి ఆత్మహత్య కాకపోవచ్చు అనేదానికి బలమైన విషయంగా కనిపిస్తోంది. బోనీ, శ్రీదేవిలకు పూణెలో ఓ ఖరీదైన స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి ఈ ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవ నడుస్తోన్నట్టు సమాచారం. ఈ కారణంగానే శ్రీదేవి ఒంటరిగా దుబాయ్ వెళ్లింది. బోనీ కపూర్ బిజినెస్ సమ్మిట్ కు వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. కానీ అదే రోజు రాత్రి శ్రీదేవి చనిపోయింది. శ్రీదేవితో వెళ్లకుండా సడెన్ గా బోనీ ఎందుకు వెళ్లాడు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఏదేమైనా శ్రీదేవి మరణం వెనక ఎన్ని మలుపున్నాయో ఊహించడానికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. అతిలోక సుందరి మరణం అంతుచిక్కకపోవడం అభిమానుల్ని మరింత కలచివేస్తోంది.

More Related Stories