English   

అప్పుడు సౌంద‌ర్య‌.. ఇప్పుడు శ్రీ‌దేవి..

Sri-devi

నిన్న‌టి వ‌ర‌కు కూడా పెళ్లి హ‌డావిడిలో అంద‌ర్నీ అల‌రించిన అతిలోక‌సుంద‌రి అంత‌లోనే అనంత‌లోకాల‌కు త‌ర‌లి వెళ్లిపోయింది. అంద‌ర్నీ శోక‌సంద్రంలో ముంచేస్తూ తాను ఒక్క‌తే దివికి ఎగిరిపోయింది ఈ దేవ‌క‌న్య‌. ఇప్పుడు శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కావ‌డం లేదు. అస‌లు ఇది అబ‌ద్ధం అయితే బాగున్ను అంతా మౌనంగా రోదిస్తున్నారు. ఇప్పుడు శ్రీ‌దేవి మ‌ర‌ణం ఒక‌ప్పుడు సౌంద‌ర్య‌ను గుర్తు చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రి మ‌ధ్య న‌వ్వుతూ తిరిగిన శ్రీ‌దేవి.. స‌డ‌న్ గా కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. అప్ప‌ట్లో సౌంద‌ర్య కూడా రాజ‌కీయ ప్ర‌చారం కోసం వెళ్లి ప్రాణాలు విడిచింది. ఈ ఇద్ద‌రిలోనూ ఓ కామ‌న్ పాయింట్ ఉంది. ఇద్ద‌రూ తెలుగుతో పాటు హిందీలోనూ పాపుల‌ర్. సౌంద‌ర్య కంటే శ్రీ‌దేవి కొన్ని వంద‌ల రెట్లు ఎక్కువ‌. అప్ప‌ట్లో సౌంద‌ర్య మ‌ర‌ణం సౌత్ తో పాటు నార్త్ ఇండ‌స్ట్రీ కూడా జీర్ణించుకోడానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఇప్పుడు మ‌ళ్లీ శ్రీ‌దేవి ఇలాంటి షాక్ ఇచ్చింది. అస‌లు ఏమైందో తెలియక ముందే.. శ్రీదేవి చ‌నిపోయింద‌నే వార్త‌లు ధావాళంలా వ‌చ్చేసాయి. అప్పుడు సౌంద‌ర్య కూడా తెలుగుతో పాటు హిందీ ఇండ‌స్ట్రీలో కూడా త‌న‌దైన గుర్తింపు వేసింది. శ్రీ‌దేవి కూడా అంతే. తెలుగు వాళ్ల‌తో పాటు ప్ర‌తీ ఇండ‌స్ట్రీ కూడా ఇప్పుడు క‌న్నీటి సంద్రం అయిపోతుంది. కేవ‌లం 54 ఏళ్ల‌కే ఆమెకు నూరేళ్లు నిండిపోతాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఏం చేస్తాం.. ఆ దేవుడు క‌ఠినం అప్ప‌ట్లో సౌంద‌ర్య‌ను త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల నుంచి దూరం చేసి ఏడిపించాడు. ఇప్పుడు దేవ‌క‌న్య‌ను మ‌ళ్లీ త‌న లోకానికి ర‌ప్పించుకున్నాడు.

More Related Stories