English   

అభిమానుల రోద‌న‌.. అంత్య‌క్రియలు పూర్తి..

Funeral of Bollywood actress Sridevi Kapoor held in Mumbai

అయిపోయింది.. అతిలోక‌సుంద‌రి వెళ్లిపోయింది.. ఇంకెప్పుడూ ఎవ‌రికీ క‌నిపించ‌నంత దూరం వెళ్లిపోయింది. స్వ‌ర్గ లోకపు దారులు ఈ ముద్దుగుమ్మ‌కు తెరుచుకున్నాయి. 50 ఏళ్లుగా ప్రేక్ష‌కుల మదిలో గూడు క‌ట్టుకున్న శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు అశృన‌య‌నాల మ‌ధ్య పూర్తైపోయాయి. లోకాన్ని విడిచి నాలుగు రోజులు అయినా.. భౌతికంగా ఆమె రూపం మాత్రం ఈ రోజే పూర్త‌యింది. అభిమానుల తాకిడి.. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం మ‌ధ్య ముంబైలోని వెల్లె పార్లే స్మ‌శాన వాటిక‌లో శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు ముగిసాయి. ఆమెను చూడ్డానికి వేలాది మంది అభిమానులు సెలెబ్రేష‌న్స్ స్పోర్ట్స్ క్ల‌బ్ కి వ‌చ్చారు. శ్రీ‌దేవి అంతిమయాత్ర మ‌ధ్యాహ్నం 2.20కు మొద‌లైంది. ఆ త‌ర్వాత స్మ‌శాన వాటిక‌లో అధికార లాంఛ‌నాల‌తో ముగిసాయి. ఏదేమైనా 54 ఏళ్ల అతిలోక సౌంద‌ర్యం అంద‌నంత ఎత్తుకు చేరిపోయింది.

More Related Stories