English   

ఇంకొన్ని గంట‌ల్లో ఆ రూపం మాయం..

sridevi

శ్రీ‌దేవి.. ఎన్నో కోట్లాది మంది హృద‌యాల్లో గూడు క‌ట్టుకున్న న‌టి.. అందాల రాశి. ఇక ఇప్పుడు ఆ అందం లేదు. మ‌రికొన్ని గంట‌ల్లోనే జీవితంలో మ‌ళ్ళీ ఎవ‌రికి క‌నిపించ‌కుండా వెళ్లిపోతుంది. దుబాయ్ లో నాలుగు రోజుల కింద మ‌ర‌ణించిన శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఫిబ్ర‌వ‌రి 27న ఇండియాకు వ‌చ్చింది. ముంబైలోని శ్రీ‌దేవి నివాసంలోనే ఇప్పుడు ఆమె భౌతికకాయం ఉంది. అక్క‌డే సెలెబ్రెటీస్ వ‌చ్చి నివాళులు అర్పిస్తున్నారు. కానీ సాధార‌ణ జ‌నం ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అభిమాన తార క‌డ‌సారి చూపుల‌కు కూడా వాళ్లు నోచుకోవ‌డం లేదు. అక్క‌డ పోలీసుల తాకిడితో. ఇక శ్రీ‌దేవి పార్థివ‌దేహాన్ని అభిమానుల సందర్శనార్థం అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలా సెలెబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఫిబ్ర‌వ‌రి 28 ఉద‌యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంచనున్నారు. అంతిమయాత్ర మ‌. 2 తర్వాత ప్రారంభమవుతుంది. అంత్యక్రియలు విలే పార్లె సేవా సమాజ్‌ క్రిమిటో రియంలో సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో నిర్వహించనున్నట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. అంత‌కుముందు శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై లోని త‌న ఇంటికి తీసుకొచ్చేట‌ప్పుడు ఎయిర్ పోర్ట్ నుంచి మీడియాకు కనిపించకుండానే ప్ర‌త్యేక అంబులెన్స్ లో తీసుకొచ్చారు. క‌నిపిస్తే అభిమానుల తాకిడి త‌ట్టుకోలేమ‌ని ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి ఏదేమైనా ఇంకా కొన్ని గంట‌ల్లో ఆ దేవి రూపం ఇక ఎప్ప‌టికీ క‌నిపించ‌కుండా వెళ్లిపోతుంది. 
 

More Related Stories