English   

బాలయ్య నర్తనశాలలో భీముడుగా శ్రీహరి ఫస్ట్ లుక్ విడుదల..

Srihari as Bheema
2020-10-21 12:16:26

17 ఏళ్ల క్రితం ఆగిపోయిన బాలకృష్ణ నర్తనశాల ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాను దసరా సందర్భంగా ఆన్లైన్లో విడుదల చేయాలని బాలయ్య భావించాడు. అలా వచ్చిన డబ్బులు చారిటీ కోసం వాడుకుంటామని చెప్పాడు బాలకృష్ణ. అలా అనౌన్స్ చేసింది తడువు నర్తనశాల ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. ఈ సినిమాలో భీముడు పాత్రలో శ్రీహరి నటించాడు. హీరోగా కెరీర్ మంచి రేంజ్ లో ఉన్నప్పుడు ఈ సినిమా ఒప్పుకున్నాడు రియల్ స్టార్ శ్రీహరి. అప్పట్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉండేది. 2004 లో నర్తనశాల మొదలైంది. భీముడి పాత్రకు శ్రీహరి తప్ప మరొకరిని ఊహించుకోలేను అని చెప్పాడు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన ఫస్ట్ లుక్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నిజంగానే బాలయ్య నర్తనశాల భీముడుగా శ్రీహరి తప్ప మరే నటుడూ సరిపోడు. ఆయన శరీర సౌష్టవం భీముడి పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత రియల్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఆయన చనిపోయిన 7 ఏళ్ళ తర్వాత.. 17 సంవత్సరాల క్రితం నటించిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కావడం నిజంగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు రియల్ స్టార్ అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇక భీముడు ఫస్ట్ లుక్ చూసిన తర్వాత రియల్ స్టార్ కొడుకు మేఘంష్ శ్రీహరి కూడా బాగా ఎగ్జైట్ అయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత నాన్నగారిని తెరపై చూడటం ఆనందంగా ఉంది.. అసలు ఊహించలేదని ఆనందంలో తేలిపోయాడు. ఏదేమైనా కూడా కేవలం 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలు ముడతలు చేస్తుంటేనే ఈ స్థాయిలో  ట్రెండింగ్ అవుతుంది. అదే పూర్తి సినిమా విడుదల అయి ఉంటే బాలయ్య నిజంగా అద్భుతాలు చేసేవాడేమో.

More Related Stories