English   

రాజుగారికి మామూలు షాక్ కాదిది..!

Srinivasa-Kalyanam
2018-08-12 16:52:56

అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చాలు చెప్ప‌డానికి. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణం ప‌రిస్థితి కూడా ఇంతే. ఇక్క‌డ అంటే సినిమా భ‌విష్యత్ ఏంటో చెప్ప‌డానికి మ‌రిన్ని రోజులు కావాలి కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం సినిమాను మ‌రో మాట లేకుండా తిప్పికొట్టారు. శ‌త‌మానం భ‌వ‌తికి క‌నెక్ట‌య్యారు కానీ ఈ చిత్రాన్ని మాత్రం ముందే వ‌ద్ద‌నుకున్నారు. అందుకే ప్రీమియ‌ర్స్ నుంచే శ్రీ‌నివాస క‌ళ్యాణంకు తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు మూడ్రోజుల్లో క‌నీసం కోటి మార్క్ కూడా అందుకోలేక ఎటూ కాకుండా పోయింది ఈ చిత్రం. అంతేకాదు.. ఈ మ‌ధ్య కాలంలో నితిన్ కెరీర్ లోనే త‌క్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా శ్రీ‌నివాస క‌ళ్యాణం మిగిలిపోయింది.  దిల్ రాజు బ్రాండ్ కూడా ఈ సినిమాపై ప‌ని చేయ‌లేదు. బ‌హుశా పెళ్లి గురించి క్లాస్ పీకిన‌ట్లుగా యుఎస్ ఆడియ‌న్స్ కు అర్థం అయిందేమో అందుకే ఈ శ్రీ‌నివాస క‌ళ్యాణంకు అంత‌గా క‌నెక్ట్ కాలేక‌పోతున్నారు వాళ్లు. మూడు కోట్ల‌కు పైగా రేట్ పెట్టి కొన్ని ఈ చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 3 ల‌క్ష‌ల డాల‌ర్లు కూడా రాలేదు. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 1 మిలియ‌న్ రావాలి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే క‌నీసం హాఫ్ మిలియ‌న్ కూడా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. దాంతో నితిన్ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ వ‌చ్చి చేరిపోయింది. 

More Related Stories