English   

 శ్రీ‌నివాస క‌ళ్యాణం.. శ్రీ నివాస్ క‌ళ్యాణం..!

srinivasa kalyanam
2018-07-22 20:10:23

టైటిల్.. పోస్ట‌ర్స్.. పాట‌.. అన్నీ పెళ్లికి సంబంధించిన‌వే విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న‌. కానీ ఇప్పుడు టీజ‌ర్ మాత్రం పూర్తిగా రొమాంటిక్ అయిపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ లో నితిన్.. రాశీఖ‌న్నా రొమాన్స్ ను హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకెలా ఉంటుందో ఒక్కసారి  మీరే ఊహించుకోండంటూ ప్రేక్ష‌కుల‌కే వ‌దిలేసాడు ద‌ర్శ‌కుడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది సినిమా.

ఆగ‌స్ట్ 9 న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే విడుద‌లైన ఆడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన పాటల్లో టైటిల్ సాంగ్ అయితే చార్ట్ బ‌స్ట‌ర్ అయిపోయింది. ల‌వ‌ర్ తో కాస్త గాడిత‌ప్పిన దిల్ రాజు.. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంతో లెక్క స‌రిచేయాల‌ని చూస్తున్నాడు. పైగా రెండు వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కూడా ఈ చిత్రంతో ఫామ్ లోకి వ‌చ్చేస్తానంటూ ధీమాగా ఉన్నాడు. ఇందులో శ్రీ‌.. నివాస్ లుగా రాశీఖ‌న్నా, నితిన్ న‌టిస్తున్నారు. వీళ్లిద్ద‌రి పేర్లు క‌లిపే శ్రీ‌నివాస క‌ళ్యాణం చేసాడు స‌తీష్ వేగేశ్న‌. 

More Related Stories