English   

దిల్ రాజు కు దిమ్మతిరిగే షాక్

Srinivasa-Kalyanam-dil-raju
2018-08-11 13:34:16

తానేం చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తానంటూ ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే నిర్మాత దిల్ రాజు. అయితే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ దిల్ రాజు కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మామూలుగా శతమానం భవతి హిట్ అయింది కాబట్టి.. అదే ఫ్లేవర్ లో ఈ కళ్యాణం కూడా జరిపించేద్దాం అనుకున్న అతని ప్లాన్ బెడిసికొట్టింది. మొదటి రోజు కాస్త ఫర్వాలేదనిపించిన కలెక్షన్స్ రెండో రోజుకు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఇది నితిన్ కు కూడా షాకింగ్ న్యూసే. అయితే దిల్ రాజు ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఈ శ్రీనివాస కళ్యాణం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోకంటే .. ఓవర్శీస్ లో దిల్ రాజు సినిమా పరిస్థితి మరీ ఘోరంగా మారింది. 

మామూలుగా దిల్ రాజు సినిమాలకు ఓవర్శీస్ లో మంచి కలెక్షన్ప్ ఉంటాయి. రివ్యూస్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ చూస్తారు. కానీ శ్రీనివాస కళ్యాణం విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ కలెక్షన్స్ లో దిల్ రాజు సినిమాలకు మంచి రికార్డ్ ఉంది. అలాగే నితిన్ అ.. ఆ.. సినిమా కూడా రెండు మిలియన్స్ పైనే సాధించి కొన్నాళ్ల పాటు టాప్ ప్లేస్ లో ఉంది. అలాంటిది ఈ సినిమాకు ఓవరాల్ గా హాఫ్ మిలియన్ రావడం కూడా అసాధ్యం అంటున్నారు. సినిమా ఏ దశలోనూ ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు.. కథ, కథనాల్నీ మరీ సీరియల్ కంటే దారుణంగా ఉండటం.. ఏ కొత్తదనం లేని పాయింట్ కూడా ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. మొత్తంగా తను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా అని చెప్పుకున్న శ్రీనివాస కళ్యాణం దిల్ రాజు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజుకే ఏ థియేటర్ లోనూ 30శాతం కూడా నిండలేదు.. దీన్నిబట్టి శ్రీనివాస కళ్యాణం పరిస్థితి ఊహించేయొచ్చు. 

More Related Stories