English   

దిల్ రాజు అంద‌రికీ చూపిస్తున్నాడు..

Srinivasa-Kalyanam
2018-08-07 12:04:41

టైటిల్ చూసి త‌ప్పుగా అనుకోవ‌ద్దు.. ఆయ‌న ఏది చూపించాలో అదే చూపిస్తున్నాడు కానీ అన్నీ కాదు. శ్రీ‌నివాస క‌ళ్యాణం సినిమాతో ఆగ‌స్ట్ 9న రానున్నాడు ఈ నిర్మాత‌. అయితే ఈ సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు దిల్ రాజు. ఆ ఎగ్జైట్ మెంట్ లో ఏం చేస్తున్నాడో కూడా తెలియ‌డం లేదు. గ‌తంలో త‌న సినిమా విడుద‌ల‌కు ముందే ఎవ‌రికీ పెద్ద‌గా చూపించిన దాఖ‌లాలు లేవు. వార‌సులు ఉంటే వాళ్ల తండ్రులకు త‌ప్ప మ‌రెవ‌రికీ స్పెష‌ల్ స్క్రీనింగ్ కూడా వేయ‌డు దిల్ రాజు. అలాంటిది శ్రీ‌నివాస క‌ళ్యాణం విష‌యంలో ఉత్సాహంగా ఉన్నాడు రాజు. 

విడుద‌లకు ముందే తన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు.. ద‌ర్శ‌కుల‌కు షోలు వేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే బ‌య్య‌ర్ల‌కు షో ప‌డిపోయింది.. అదిరింది అనే టాక్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు వంశీ పైడిప‌ల్లితో పాటు మ‌రికొంద‌రు ద‌ర్శ‌కుల‌కు కూడా షో వేసాడు దిల్ రాజు. సినిమా చూసిన త‌ర్వాత వంశీ కూడా అదిరిపోయింది.. జాతీయ అవార్డు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న గారి నుంచి మ‌రో అద్భుతం వ‌చ్చిందంటూ ట్వీటేసాడు. ఇక మీడియాకు కూడా ఓ రోజు ముందే షో వేయ‌బోతున్నాడు ఈ నిర్మాత‌. మొత్తానికి ఈయ‌న దూకుడు చూస్తుంటే ప్రేక్ష‌కుల‌కు కూడా ఆస‌క్తి ఆగ‌డం లేదు. ఎప్పుడెప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణం విడుద‌ల‌వుతుందా అని చూస్తున్నారు. 

More Related Stories