English   

నేడే శ్రీనివాస కళ్యాణం ఆడియో రిలీజ్

Srinivasa kalyana
2018-07-21 17:27:32

నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శతమానం భవతితో మంచి హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకుడు. దిల్ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. నితిన్, రాశిఖన్నా కలిసి ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో రేపు విడుదల కాబోతోంది. అయితే ఈ ఆడియో ఒక ఈవెంట్ కాదు.. బ్యూటీఫుల్ మూమెంట్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆడియో రిలీజ్ డేట్ తెలియజేస్తూ వేసిన పోస్టర్స్ లో ఈ క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఆడియో ఫంక్షన్స్ ను ఈవెంట్స్ గా పిలిచాం.. అందుకు భిన్నంగా దీన్నో బ్యూటీఫుల్ మూమెంట్ గా మార్చేందుకు చిత్ర యూనిట్ ఈ ఫంక్షన్ ను పూర్తి డిఫరెంట్ గా చేయబోతోందనుకోవచ్చు. మరి ఈ కళ్యాణం పాటల పండగకు చీఫ్ గెస్ట్ లు ఎవరు..? అతిథులు ఎవరు..? అనేది మాత్రం వెల్లడించలేదు. 

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈమధ్య అతను వరుసగా మళ్లీ ఫెయిల్ అవుతున్నాడు. శ్రీనివాస కళ్యాణం మళ్లీ తనకు పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఆగస్ట్ 9న విడుదల కాబోతోన్న ఈ సినిమా తమ బ్యానర్ లో మళ్లీ సూపర్ హిట్ ఇస్తుందని దిల్ రాజు కూడా నమ్ముతున్నాడు. మరి వీరి నమ్మకం నిజం కావాలని కోరుకుందాం.. 

More Related Stories