English   

ఆగ‌స్ట్ లో ఆ ముగ్గురు..

Geetha-Govindam

హీరోల మ‌ధ్య స‌మ‌రం.. ద‌ర్శ‌కుల మ‌ధ్య స‌మ‌రం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కానీ నిర్మాత‌ల మ‌ధ్య స‌మ‌రం ఇప్పుడు ఆస‌క్తి కాదు.. ఏకంగా టెన్షన్ బిపిలు కూడా పెంచేస్తున్నాయి. దానికి కూడా ఓ కార‌ణం ఉంది. ఎందుకంటే వాళ్లంతా ఇండ‌స్ట్రీలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన మ‌హా మ‌హా నిర్మాత‌లు. వాళ్ల మ‌ధ్య స‌మ‌రం అంటే క‌చ్చితంగా ఆస‌క్తిక‌ర‌మే క‌దా..! ఆగ‌స్ట్ లో ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. ముగ్గురు నిర్మాత‌ల మ‌ధ్య వార్ జ‌ర‌గ‌బోతుంది. ఆగ‌స్ట్ 9న అంద‌రికంటే ముందే వ‌స్తున్నాడు దిల్ రాజు. ఈయన నిర్మిస్తున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం అదే రోజు రానుంది. నితిన్, రాశీఖ‌న్నా జంట‌గా స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పుడు దిల్ రాజు ఉన్న ఫామ్ చూస్తుంటే శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా హిట్ కొట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. ఇక ఆగ‌స్ట్ 15న గీతాఆర్ట్స్ నుంచి అల్లు అర‌వింద్ పోటీకి దిగుతున్నాడు. ఈయ‌న నిర్మిస్తున్న గీత గోవిందం ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. ఈ ఇద్ద‌రికి పోటీగా సురేష్ బాబు కూడా చిన్న సినిమాతో వ‌స్తున్నాడు. ఈయ‌న స‌పోర్ట్ చేస్తోన్న కేరాఫ్ కంచెల‌పాలెం సినిమా కూడా ఆగ‌స్ట్ లోనే రానుంది. దిల్ రాజు, అల్లు అర‌వింద్ తో పోలిస్తే సురేష్ బాబు చిన్న సినిమాతోనే వ‌స్తున్నాడు. ఏదేమైనా ఆగ‌స్ట్ లో ఈ ముగ్గురి వార్ మాత్రం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

More Related Stories