English   

శీనువైట్ల ఏం చేస్తాడో చూడాలిక‌..!

srinu vaitla
2018-03-09 17:40:16

ఏడాదికి పైగా వేచి చూసిన అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చింది. ఇన్నాళ్ల‌కు మ‌రో సినిమా మొద‌లుపెట్టాడు శీనువైట్ల‌. ఇన్నాళ్లూ చ‌ర్చ‌ల్లోనే ఉన్న ర‌వితేజ సినిమా ఇప్ప‌టికి ప‌ట్టాలెక్కింది. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్రిల్లో మొద‌లు కానుంది. అమెరికా నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగ‌నుంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ సినిమాతో ర‌వితేజ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్రిల్ లో పూర్తి కానుంది. అప్ప‌ట్నుంచీ మ‌ళ్ళీ శీనువైట్ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో బిజీ కానున్నాడు మాస్ రాజా. మ‌రోవైపు శీనువైట్ల‌కు ఈ సినిమా చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిగా మారింది. దారుల‌న్నీ ఉండి.. అవి మూసుకుపోయి.. ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌పుడు మ‌న‌కు అనిపించేది అష్ట‌దిగ్భందనం. ఇప్పుడు శీనువైట్ల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఎటూ క‌ద‌ల్లేని కాదు.. క‌నీసం ఎటూ చూడ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నాడు.

అస‌లు మూడేళ్ల కింది వ‌ర‌కు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడు.. అంటూ శీనువైట్ల‌ను చూసి బాధ ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చేస‌రికి శీనువైట్ల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో ఏ హీరో లేడిప్పుడు. పైగా ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా శీనువైట్ల అంటే ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏదో చేస్తాడులే.. మిస్ట‌ర్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో త‌న పాత స్నేహితుడు ర‌వితేజ‌ను ఆశ్ర‌యిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఓ క‌థ సిద్ధం చేసి.. మాస్ రాజాను ఒప్పించాడు. ఇప్పుడు దీన్ని ప‌ట్టాలెక్కించాడు కూడా. ఇందులో ర‌విత‌జ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపించినా.. అందులో నిజం లేద‌ని టైటిల్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అని ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో సినిమా చూసి తెలుసుకోండి అంటున్నాడు శీనువైట్ల‌. అయినా ఇప్పుడు శీనువైట్ల‌ను న‌మ్మి కోట్లు పెట్టే నిర్మాత‌లు చాలా అరుదు. అందుకే త‌నతో పాటు ర‌వితేజ కూడా రెమ్యున‌రేష‌న్ లేకుండానే మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఈ చిత్రం చేయ‌బోతున్నారు. విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా ఇస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాను కేవ‌లం 12 కోట్ల బ‌డ్జెట్ తోనే తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా శీనువైట్ల మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదంటే ఇంకా బ్యాక్ అయిపోతాడో..?

More Related Stories