English   

శ్రీ‌రెడ్డిని వ‌దిలేసారా..?

Srireddy casting couch
2018-06-09 10:57:04

మ‌న గురించి ఒక్క మాట అంటేనే ఎవ‌రూ ఊరుకోరు. మ‌రి అలాంటిది అన్నం పెట్టే ఇండ‌స్ట్రీ గురించి.. అందులోని మ‌నుషుల గురించి అన్నిఅన్ని మాట‌లంటుంటే ఎందుకు ఎవ‌రు శ్రీ‌రెడ్డిని ప్ర‌శ్నించ‌డం లేదు. ఎందుకు ఊరుకుంటున్నారు.. హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నా కూడా ఎందుకు అలా మౌనంగా భ‌రిస్తున్నారు..? ఇప్పుడు ఇదే అంద‌ర్లోనూ వ‌స్తున్న అనుమానం. తాజాగా నానిని మ‌రోసారి టార్గెట్ చేసింది శ్రీ‌రెడ్డి. నాకు, నానికి ఉన్నది ల‌వ్ స్టోరీ కాదు.. కామం స్టోరీ.. త్వ‌ర‌లోనే అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా మాట్లాడుతుంది ఈ యూట్యూబ్ బేబీ. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరోను ప‌ట్టుకుని అమ్మ‌నా బూతులు తిడుతుంది.. ఇండ‌స్ట్రీలో ఉన్నోళ్లంతా బ్రోక‌ర్లు అంటూ తిరుగుతుంది.. ఇన్ని చేస్తున్నా ఎందుకు శ్రీ‌రెడ్డిపై ఎవ‌రూ యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదు. అమ్మాయి అని ఊరుకుంటున్నారా.. లేదంటే నిజంగానే ఇండ‌స్ట్రీ ఇలా అయిపోయింద‌ని లైట్ తీసుకుంటున్నారా..? శ్రీ‌రెడ్డి చేస్తున్న ప‌నుల‌తో రోజురోజుకీ ఇండ‌స్ట్రీ ప‌రువు మ‌రింత‌గా దిగ‌జారిపోతుంది. ఇంత జ‌రుగుతున్నా కూడా పెద్దోళ్లెవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఏ హీరోను చూడ‌కుండా.. చిన్నాపెద్దా ప‌ట్టించుకోకుండా అంద‌ర్నీ అనేస్తుంది శ్రీ‌రెడ్డి. త‌న బండారం బ‌య‌ట‌ప‌డ‌కుండా అంద‌రి బండారాలు బ‌య‌ట పెడ‌తా అంటూ రెచ్చిపోతుంది. 

ఆడ‌దాని ఏడుపు వ‌ల్ల యుద్ధాలే జ‌రిగాయి. అప్ప‌ట్లో రాజ్యాలే కూలిపోయాయి. మ‌నుషులం.. మ‌నమెంత‌..? ఇప్పుడు కూడా ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. ఓ ఆడ‌దాని ఏడుపు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తుంది. ఆ ఏడుపు పేరు శ్రీ‌రెడ్డి. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఈ పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. శ్రీ‌లీక్స్ పేరుతో ఇప్పుడు శ్రీ‌రాస‌లీల‌లు అన్నీ బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పేర్లు బ‌య‌ట‌పెట్ట‌ని ఈ భామ‌.. ఇప్పుడు అది కూడా చేస్తుంది. దాంతో ఇండ‌స్ట్రీలో అంద‌రికీ వ‌ణుకు పుడుతుంది. ఇప్ప‌టికే సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ పేరు బ‌య‌టికి వ‌చ్చింది. అత‌డితో పాటు కొర‌టాల‌.. కోన‌వెంక‌ట్.. ర‌మేష్ పుప్పాల‌.. వైవా హ‌ర్ష‌.. ఇలా చాలా మంది పేర్లు బ‌య‌టికి తీసుకొచ్చింది శ్రీ‌రెడ్డి. వాళ్ల‌తో ఈమె చేసిన ఛాటింగ్ ను కూడా స్క్రీన్ షాట్స్ తీసి మీడియాకు ఇచ్చేసింది. 

గ‌తేడాది సుచీలీక్స్ త‌మిళ ఇండ‌స్ట్రీని ఎంతగా కుదిపేసాయో.. ఇప్పుడు శ్రీ‌లీక్స్ కూడా అంతే. రోజుకో పేరు బ‌య‌టికి వ‌స్తూ.. రోజుకో మీడియాలో కూర్చుంటూ ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఏకంగా నేష‌న‌ల్ మీడియా కూడా శ్రీ‌రెడ్డిపై ఫోక‌స్ పెట్టింది. దాంతో తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రువు మొత్తం గంగ‌లో క‌లిసిపోతుంది. అంతా ఒక్క మాట మాట్లాడ‌కుండా మిన్న‌కుండిపోతున్నారు. ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌జారులో పెడుతుంటే కూడా వేడుక చూస్తున్నారే కానీ నోరు తెరిచి ఇది ఇలా ఉంటుంది అంటూ ఎవ‌రూ చెప్ప‌ట్లేదు. దాంతో శ్రీ‌రెడ్డి చెప్పిన దానికి ఇంకా ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది. 

తెలుగు ఇండ‌స్ట్రీని ఎవ‌రైనా ఒక్క మాట అంటే మ‌నోళ్ల‌కు ఎక్క‌డ‌లేని కోపం వ‌చ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక్క న‌టి మాత్రం ఇండ‌స్ట్రీ ఇజ్జ‌త్ మొత్తం తీస్తుంది. మ‌న ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌ట్టలిప్పేస్తుంది. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీ‌రెడ్డి ఎందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుంది..? ఎందుకు ఇంత‌గా రెచ్చిపోతుంది..? మ‌రీ ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లిప్పేంత త‌ప్పు మ‌న ఇండ‌స్ట్రీ ఏం చేసింది..? ఇన్నాళ్లూ నోరు మూసుకున్న శ్రీ‌రెడ్డి ఇప్పుడు ఎందుకు రెచ్చిపోతుంది..? అంటే ఇన్నాళ్లూ క్యాస్టింగ్ కౌచ్ లేదా.. ఉన్నా నోరు విప్ప‌లేదా..? ఇప్పుడు శ్రీ‌రెడ్డి మాత్ర‌మే ఎందుకు ఇంత‌గా అన్యాయం జ‌రిగిన‌ట్లు అరుస్తుంది..? 

ఇండ‌స్ట్రీ ప‌రువు తీయాల్సిన అవ‌స‌రం ఏంటి..? త‌న‌కు ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు అంద‌రితోనూ రొమాన్స్ చేసిందా..? అంటూ ఇప్పుడు శ్రీ‌రెడ్డిపై రివ‌ర్స్ అటాక్ జ‌రుగుతుంది. ఇప్పుడు వ‌చ్చి తాను అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెడ‌తాను.. ఇండ‌స్ట్రీలో ఉన్నోళ్లంతా బ్రోక‌ర్లే.. హీరోలు కూడా అంతా అలాంటి వాళ్లే.. ప‌డుకోకపోతే ఇక్క‌డ ప‌న‌వ్వ‌దంటూ శ్రీ‌రెడ్డి చేసిన క‌మెంట్స్ పై ఇండ‌స్ట్రీ అంతా సీరియ‌స్ అవుతుంది. నాని.. శేఖ‌ర్ క‌మ్ముల లాంటి వాళ్లపై కూడా శ్రీ‌రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దానికంటే ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు అంద‌రూ చూస్తుండ‌గానే బ‌ట్టలిప్పి కూర్చోవ‌డం మాత్రం దారుణ‌మే. ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారో మ‌రి అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికైనా శ్రీ‌రెడ్డికి చెక్ పెట్ట‌క‌పోతే ఇంత‌కంటే దారుణాలు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. 

More Related Stories