English   

ఎమ్మెల్యే తో సామాన్యుడి ఫైట్

Needi-Naadi-Oke-Katha

సెల్ఫ్ టాలెంట్ తో హీరోగా ఎదుగుతోన్న కుర్రాళ్లలో శ్రీ విష్ణు ఒకడు. చిన్న పాత్రలతో పరిచయమై.. హీరోగా మారిన శ్రీ విష్ణు.. అందుకు కుర్రాళ్లలా కాకుండా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ బెస్ట్ ఫ్రెండ్ నారా రోహిత్ రూట్ లో వెళుతున్నాడు. ఇదే అతనికి తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చింది. రీసెంట్ గా అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న విష్ణు ప్రస్తుతం నీదీనాదీ ఒకే కథ అంటూ వస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే ఆశ్చర్యపరిచిందీ చిత్రం. తర్వాత టీజర్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ డ్రా చేశారు. టీజర్ తోనే ఇది నా కథ అని చాలామంది కనెక్ట్ అయిపోయారు. ఇక ఒక్కో పాటతో హైప్ పెంచుకుంటూ వెళ్లిన ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

ఈ నెల 23న నీదీనాదీ ఒకే కథ విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రెడీ అయింది. కానీ సరైన రిలీజ్ డేట్  కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశారు. మధ్యలో థియేటర్స్ బంద్ తో కొంత ఇబ్బంది పడ్డా ఫైనల్ గా 23కు డిసైడ్ అయిపోయారు. అయితే అదే రోజు నందమూరి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే కూడా విడుదలవుతోంది. మళ్లీ కొత్తగా ఏమైనా అనౌన్స్ అవుతాయోమో కానీ.. ప్రస్తుతానికి  ఎమ్మెల్యేతో ఈ సామాన్యుడు బాక్సాఫీస్ వార్ చేయబోతున్నాడు.

ఇక నీదీనాదీ ఒకే కథకు చాలా ప్రత్యేకతలున్నాయి. శ్రీ విష్ణు భార్య ప్రశాంతి, అతని ఫ్రెండ్ నారా రోహిత్ తో పాటు గతంలో రోహిత్ తో అసుర అనే సినిమా డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. వేణు ఊడుగుల అనే కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బిచ్చగాడు ఫేమ్ సత్నా టైటస్ హీరోయిన్ గా నటిస్తోంది. బిచ్చగాడు తర్వాత పెళ్లి చేసుకున్నఈ బ్యూటీకి ఇన్నాళ్లకో ఆఫర్ రావడం ఆశ్చర్యమే. ఏదో జరిగింది పాటలో తన ఎక్స్ ప్రెషన్స్ ప్రతి ఒక్కరినీ కిల్ చేశాయి. మొత్తంగా ఇప్పటికైతే పూర్తి పాజిటివ్ వైబ్స్ తో వస్తోన్న నీదీనాదీ ఒకే కథ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

More Related Stories