English   

ఆ హీరోయినా గర్భవతి...కానీ పెళ్లి ?

actress
2019-07-18 07:31:04

శృతి హరిహరన్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలీదు కానీ. ఆ మధ్య సీనియర్ హీరో అర్జున్ తనను లైంగికంగా వేదించాడు అని మీటూలో భాగంగా మాట్లాడిన నటి అంటే గుర్తు వస్తుంది. కన్నడంలో పాపులర్ అయిన శృతి హరిహరన్ మొన్నటి వరకు తనకు వివాహం అయిందనే విషయం కూడా బయట పెట్టలేదు. అలాంటిది సడన్ గా తాను గర్భవతినంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని షేర్ చేసింది. హీర్ అర్జున్‌పై ఆరోపణలు చేసినప్పుడు ఆమె పెళ్లి విషయాన్ని దాచిపెట్టిందనే వార్తలు వచ్చాయి. అర్జున్ కూడా తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. అయితే అప్పుడు శృతి హరిహరన్ అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేసింది. తన పెళ్లి గురించి దాట వేస్తూ పెళ్ల్లి అయితే ఏంటి ? కాక పోతే ఏంటి లైంగిక వేధింపులు వేధింపులే కదా అని ఆమె అప్పట్లో రచ్చ చేసింది. నిన్ను చూసేందుకు మేము ఆతృతగా ఉన్నామని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ పెద్ద పోస్ట్ రాసింది, అంతే కాక ఫోటో తీసింది నాన్న కాబోతున్న సూపర్ ఎగ్జైటెడ్ రామ్ కలరి, అందుతున్న సమాచారాన్ని బట్టి ఆమె రామ్‌ అనే వర్థమాన నటుడ్ని వివాహమాడిందట. ఆ విషయన్ని పంచుకోని ఆమె ఇప్పుడు తల్లి కాబోతున్నాను అని మాత్రం ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. మీటూ ఆరోపణల తర్వాత తనకు అవకాశాలు తగ్గాయని చెప్పిన ఈ భామ మళ్ళీ ఇలా తల్లిని అంటూ షాక్ ఇచ్చింది.

More Related Stories