English   

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు రామ‌రాజు సిద్ధం

SS Rajamouli
2021-06-22 09:55:35

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో సినిమా షూటింగ్ లు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇప్ప‌టికే చాలా సినిమాలు షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా మ‌న హైద‌రాబాద్ లో చిన్న పెద్ద తేడాలేకుండా చాలా సినిమాలు షూటింగ్ ను జ‌రుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా షూటింగ్ కూడా హైద‌రాబాద్ లో ప్రారంభం అయ్యింది.అయితే సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్ కూడా నేటి నుండి షూటింగ్ లో పాల్గొనభోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ కు హెయిర్ క‌ట్ చేసిన ప్ర‌ముఖ హెయిర్ స్టైలిస్ట్ హ‌కీం హ‌లీం వెల్ల‌డించారు. తాను రామ్ చ‌ర‌ణ్ కు హెయిర్ క‌ట్ చేశాన‌ని ఆయ‌న  నేటిం నుండి ఆర్ఆర్ఆర్ షూట్ లో పాల్గొంటార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ కూడా ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఇక ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో హెయిర్ స్టైలిస్ట్ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో రామ్ చ‌ర‌ణ్ కోర మీసాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. 

More Related Stories