English   

RRR కోసం చిత్ర విచిత్ర‌మైన టైటిల్స్.. ఎలా ఉన్నాయో తెలుసా..? 

RRR
2019-03-20 12:05:42

ఇప్పటివరకు తన సినిమా టైటిల్స్ ని తాను మాత్రమే పెట్టాడు రాజమౌళి. కానీ తొలిసారి అవకాశం అభిమానులకు ఇచ్చాడు. దానివల్ల సినిమా ప్రమోషన్ కూడా భారీగా పెరుగుతుంది. విడుదలయ్యేంత వరకు తన సినిమా ప్రేక్షకుల నోళ్ల‌లో నానాలి అంటే ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే బాహుబలికు ఉన్న డిమాండ్ వేరు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై కూడా ఆ అంచనాలు ఉంటాయి. అయితే బాహుబలి కి వచ్చిన క్రేజ్ మిగిలిన ఇండస్ట్రీల‌లో ఈ సినిమాకు రావడం మాత్రం అంత ఈజీ కాదు. అందుకే మిగిలిన ఇండస్ట్రీల‌లో కూడా తన సినిమా గురించి మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ వేశాడు రాజమౌళి. తన సినిమాకు టైటిల్ మీరే పెట్టండి అంటూ అభిమానులకు ఒక పజిల్ వదిలాడు.  టైటిల్లో ఉన్న మూడు అక్షరాలకు మీరే వివరణ ఇవ్వండి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు రాజమౌళి. ఇక ఇందులో ఉన్న మూడు ఆర్ లకు మూడు అర్థాలు వచ్చేలా ప్రేక్షకులు ఎవరికి నచ్చిన టైటిల్స్ వాళ్లు చిత్ర యూనిట్ కి పంపుతున్నారు. అందులో ముఖ్యంగా రఘుపతి రాఘవ రాజారాం, రౌద్ర రణ రంగం, రం రం రుధిరం.. ఇక‌ ముందు నుంచి వినిపిస్తున్నట్లు రామ రావణ రాజ్యం ఇలా చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాజమౌళి ఏది సెలెక్ట్ చేసుకుంటాడ‌నేది ఆసక్తికరంగా మారింది. దేశభక్తి ఉన్న సినిమా కాబట్టి రఘుపతి రాఘవ రాజారాం అయితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ సినిమా 2020 జులై 30న విడుదల కానుంది.
 

More Related Stories