English   

థ‌మ‌న్.. ఎన్నాళ్ల‌కు మ‌ళ్లీ నిల‌బెట్టాడో..? 

SS-Thaman
2018-02-12 15:46:37

ఎప్పుడూ రొటీన్ మ్యూజిక్ ఇస్తాడు.. ఇవే పాట‌లు ఎన్నిసార్లు కొడ‌తాడు.. అంటూ థ‌మ‌న్ ను విమ‌ర్శించేవాళ్లంతా. అత‌డు మ్యూజిక్ ఇస్తే ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేస్తాడు.. లేజీగా ఉంటాడు అనే పేరుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇవ‌న్నీ ఎగిరిపోయాయి. ఒక్క సినిమాతో తానేంటో.. త‌న మ్యూజిక్ ప‌వ‌ర్ ఏంటో చూపించాడు థ‌మ‌న్. అదే తొలిప్రేమ‌. ఈ సినిమాను పూర్తిగా త‌న సంగీతంతో నిల‌బెట్టాడు థ‌మ‌న్. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడే. ప్ర‌తీ సీన్ ను.. ప్ర‌తీ ఫ్రేమ్ ను త‌న ఆర్ఆర్ తో మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. వెంకీ అట్లూరి రాసుకున్న అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు త‌న అంద‌మైన సంగీతాన్ని తోడు చేసి.. శిల్పానికి ప్రాణం పోసాడు థ‌మ‌న్. మిగిలిన సినిమాల మాదిరి ఆ మాస్ రొటీన్ మ్యూజిక్ కాకుండా.. ఎక్క‌డో తెలియ‌ని కొత్త ఫీల్ తీసుకొచ్చాడు థ‌మ‌న్. నిజంగా ఈ పాట‌లిచ్చింది థ‌మ‌నేనా అనే అనుమానం అయితే క‌చ్చితంగా వ‌స్తుంది. ఎందుకంటే ఈ సినిమా మ్యూజిక్ లో అంత ఫ్రెష్ నెస్ క‌నిపిస్తుంది. అల్ల‌సాని వారి ప‌ద్య‌మా.. నిన్నిలా.. తొలిప్రేమ టైటిల్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. మొత్తానికి తొలిప్రేమ‌కు బ్యాక్ బోన్ లా నిలిచి.. త‌న కెరీర్ కు మ‌రో పునాది వేసుకున్నాడు థ‌మ‌న్. ప్ర‌తీ సినిమాకు థ‌మ‌న్ నుంచి ఇలాంటి కొత్త‌ద‌న‌మే కోరుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా..!

More Related Stories