English   

నాన్న నాకు కార్ కొనివ్వు..

Allu Arjun at Geetha Govindam Audio Launch
2018-07-30 10:18:29

ఈ మాట అడిగింది ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఈయనకు ఏం తక్కువ కార్ కొనలేడా అనుకుంటున్నారా..? ఆయన కొంటే ఏం బాగుంటుంది అందుకే నాన్నను అడిగాడు. పైగా బన్నీకి ఇప్పుడు మరో పనేది లేనట్లుంది. అందుకే హాయిగా తమ సినిమా వేడుకలకు వచ్చేస్తున్నాడు. మొన్నటికి మొన్న విజేత వేడుకకు వచ్చి అల్లుడికి సపోర్ట్ చేసాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవర కొండ నటించిన గీతగోవిందం ఆడియో వేడుకకు వచ్చాడు. అయితే దీనికి రావడానికి కారణం మాత్రం గీతాఆర్ట్స్ లో సినిమా తెరకెక్కడమే. సొంత నిర్మాణ సంస్థలో కాబట్టి మరో మాట లేకుండా వచ్చాడు బన్నీ. అయితే ఈ వేడుకలో ఎందుకో తెలియదు కానీ సరికొత్త బన్నీ కనిపించాడు ప్రేక్షకులకు.

సాధారణంగా తన సినిమాల వేడుకల్లో కూడా అంత యాక్టివ్ గా ఉండని బన్నీ.. ఈ సారి మాత్రం చాలా సరదగా కనిపించాడు. మధ్యమధ్యలో సెటైర్లు కూడా వేసాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లుంగీతో పాటు ఆయన అర్జున్ రెడ్డిపై కూడా సెటైర్లు వేసాడు బన్నీ. ఇక తన తండ్రి అల్లుఅరవింద్ గురించి మాట్లాడుతూ మా నాన్న గురించి ఏం మాట్లాడతాను.. నాన్న సినిమా హిట్ అవ్వాలి.. డబ్బులు సంపాదించు.. నాకు మంచి కార్ కొనివ్వమంటూ అడిగాడు. ఆడియో వేడుక మొత్తం చాలా జోష్ గా కనిపించిన బన్నీ.. తాను సినిమా చూసాను.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇది రాసి పెట్టుకోండంటూ భరోసా కూడా ఇచ్చి వెళ్లాడు. మొత్తానికి బన్నీ దూకుడుతో గీతగోవిందం ఆడియో సూపర్ హిట్ అయింది. 

More Related Stories