English   

సుధీర్ బాబుతో సినిమాను అనౌన్స్ చేసిన లవ్ స్టోరీ నిర్మాతలు

Sudheer Babu
2021-07-17 22:44:33

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థ వరుసగా సినిమాలు నిర్మిస్తూ.. దూసుకెళుతుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ మూవీ నిర్మిస్తుంది. అలాగే నాగచైతన్య - ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమాను నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇటీవల కోలీవుడ్ హీరో ధనుష్ - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ యువ హీరో సుధీర్ బాబు హీరోగా హర్షవర్థన్ దర్శకత్వంలో ఓ సినిమాను ఈ రోజు ప్రకటించింది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ నెం 5 గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. సోనాలి నారంగ్ - శ్రీష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. 

More Related Stories