English   

అల్లుడు స‌మ్మోహ‌నంగా వ‌స్తున్నాడు..

sammohanam movie

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎలాగూ అల్లుళ్ల హ‌వా బాగానే న‌డుస్తుంది. ప‌డుతూ లేస్తూ కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు కూడా కెరీర్ ను లాక్కొస్తున్నాడు. ఈ హీరో ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ ద‌ర్శ‌కుల్లో ఈయన కూడా ఒక‌రు. ఈయ‌న‌కు మంచి పేరు ఉంటుంది.. హిట్లు కూడా ఉంటాయి.. కానీ ఎందుకో తెలియ‌దు కానీ స్టార్స్ ఈయ‌న‌తో ప‌ని చేయ‌రు. గ‌తేడాది ఈయ‌న నుంచి వ‌చ్చిన అమీతుమీ సూప‌ర్ హిట్ అయింది. దానికి ముందు నానితో చేసిన జెంటిల్ మ‌న్ కూడా హిట్టే. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నాని మాత్ర‌మే ఈయ‌న‌తో సినిమా చేసిన పెద్ద స్టార్. అమీతుమీ త‌ర్వాత మ‌రోసారి చిన్న హీరోతోనే క‌మిటయ్యాడు ఇంద్రగంటి. సుధీర్ బాబుతో ఈయ‌న కొత్త సినిమా చేస్తున్నాడు. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైద్రీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. దీనికి స‌మ్మోహ‌నం అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చింది. మొత్తానికి చూడాలిక‌.. ఈ ఘ‌ట్ట‌మ‌నేని అల్లుడితో ఇంద్ర‌గంటి స‌మ్మోహ‌నం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories