English   

డీసెంట్  కలెక్షన్స్ తో సమ్మోహనం చేస్తున్నారు..

Sudheer-Babu
2018-06-21 20:40:55

సుధీర్ బాబు, అదితిరావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం బాక్సాఫీస్ వద్దా సమ్మోహనంగా ఆడుతోంది. క్లాస్ మూవీగా పేరు తెచ్చుకున్న సమ్మోహనం.. కలెక్షన్స్ లో నూ ఆ క్లాస్ ను నిలబెట్టుకుంటోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి సమ్మోహనం వాల్డ్ వైడ్ గా 3.79కోట్లు షేర్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. సుధీర్ బాబు కెరీర్ లో ఫస్ట్ వీక్ లో ఇవే హయ్యొస్ట్ కలెక్షన్స్.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ బ్రిలియంట్ రైటప్ కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాగే హీరోయిన్ అదితిరావు హైదరి ఫ్రెష్ లుక్స్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఇక సుధీర్ తో తన కెమిస్ట్రీ కూడా నేచురల్ గా పండటంతో అన్ని వర్గాల నుంచి సమ్మోహనంకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే ఈ కలెక్షన్స్ అనుకోవచ్చు. ఇక ఏరియాల వారీగా సమ్మోహనం కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజా    -  88 లక్షలు 
సీడెడ్    -  28  లక్షలు  
ఉత్తరాంధ్ర    -  30  లక్షలు 
గుంటూరు    -  21  లక్షలు 
తూ. గో    -  21  లక్షలు 
ప. గో    -  15  లక్షలు 
కృష్ణా    -  20 లక్షలు 
నెల్లూరు    -  10  లక్షలు 
టోటల్ ఏపి ప్లస్ తెలంగాణ కలిపి     - 2కోట్ల 33లక్షలు
ఓవర్శీస్     - 1.08కోట్లు
రెస్టాఫ్ వరల్డ్    - 33లక్షలు 

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ షేర్ గా     - 3కోట్ల 79లక్షలు 
ఏదేమైనా అంచనాలను మించి మంచి కలెక్షన్స్ తో సమ్మోహనం బాక్సాఫీస్ వద్దా సమ్మోహన పరుస్తోంది. 

More Related Stories