English   

రక్షకుడు వచ్చేసాడు.. V సినిమాలో సుధీర్ ఫస్ట్ లుక్.. 

Sudheer Babu
2020-01-27 15:01:12

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈయన ప్రస్తుతం వి సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుంటే నాని విలన్ గా చేస్తున్నాడు. ఈ రోజుల్లో మన హీరోలకు విలన్ గా నటించడం అలవాటైపోయింది. దాన్ని ట్రెండ్ గా మార్చేస్తున్నారు కూడా.

దానికి తోడు దర్శకులు కూడా హీరోలకు సరిపోయే కథలు తీసుకొస్తున్నారు. వాళ్లు చెప్పే కథలు నచ్చితే ప్రతినాయక పాత్రలు చేయడానికి కూడా మన హీరోలు వెనకాడటం లేదు. నాని కూడా ఇదే చేస్తున్నాడిప్పుడు. పైగా వి ఆయనకు 25వ సినిమా. అందుకే ప్రత్యేకంగా ఉండాలని విలన్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్, ఎంసిఏ సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు మూడోసారి దిల్ రాజుతో సినిమా చేస్తున్నాడు నాని. 

ఇంద్ర‌గంటి మోహన కృష్ణ ఈ క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడని.. నాని కూడా తన కెరీర్ కు ప్రాణం పోసిన ఇంద్రగంటి మోహనకృష్ణ తోనే 25వ సినిమా చేయడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇందులో పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఓ పాట, ఫైట్ బ్యాలెన్స్ తప్ప షూటింగ్ అంతా అయిపోయింది. సుధీర్ బాబు లుక్ కూడా బాగుంది. రక్షకుడు అంటూ దీన్ని విడుదల చేసారు. జనవరి 28న రాక్షసుడు అంటే నాని లుక్ విడుదల కానుందన్నమాట. 

ఇంద్రగంటిపై నమ్మకంతో ఇంకో మాట మాట్లాడకుండా విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు నాని. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చ్ 25, 2020న విడుదల కానుంది ఈ చిత్రం. జెంటిల్ మెన్ లో కాసేపు ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించినా.. చివరికది హీరోగానే ముగిసింది. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి విలన్ గా నాని నటిస్తున్నాడు. మరి ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories